టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతుంది రష్మిక మందన్న . చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత... వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన కెరియర్ లో దూసుకుపోతుంది రష్మిక మందన. ఇక విజయ్ దేవరకొండ తో జోడిగా నటించిన గీత గోవిందం కూడా భారీ విజయం సాధించడంతో రష్మిక మందన్న క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటించింది ఈ అమ్మడు . అయితే టాలీవుడ్రష్మిక విజయ్ దేవరకొండ  రొమాన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి. 

 

 

 

 అందం చందం కలిపిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న ... ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్  టాప్ హీరోయిన్  ప్లేస్ లో కొనసాగుతుంది ఈ అమ్మడు. అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది ఈ అమ్మడు. ఇక విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది రష్మిక మందన్న. అయితే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. తన సినిమాలకు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్ పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఆలోచిస్తూ ఉంటుంది రష్మిక మందన. 

 

 

 

 అయితే ఈ బ్యూటీకి తెలుగులోనే కాదు అటు కన్నడంలో కూడా వరుస  సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. కాగా ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా  నటిస్తోంది రష్మిక మందన. అయితే ఇప్పుడు తన పర్సనల్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేసి... అభిమానులను అలరిస్తుంటుంది రష్మిక. కాగా తాగాగా తన ట్విట్టర్  ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది రష్మిక . చిన్నప్పుడు ఎలా ఉన్నానో  చూడండి అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది రష్మిక మందన్న. అయితే రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలో  చబ్బీ చీక్స్ తో రష్మిక ఎంతో క్యూట్ గా అందంగా  కనిపిస్తుంది రష్మిక మందన్న. కాగా  రష్మిక పోస్ట్ చేసిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: