కొంత మంది హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లను రీప్లేస్ చేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఇంతకముందు మన టాలీవుడ్ హీరోలందరు వరుసగా మణిశర్మ ని తమ సినిమాలకు కావాలని పట్టు పట్టేవారు. అలా మణిశర్మ తప్ప ఇంకెవరు వద్దు అన్న లిస్ట్ లో మెగాస్టార్ నుంచి మహేష్ వరకు చాలామంది ఉన్నారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ని రీ-ప్లేస్ చేయడం ఇష్టపడని హీరోల్లో మాస్ మహారాజా రవితేజ అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. రవితేజ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లకు సంగీతం అందించిన థమన్ అంటే విపరీతమైన సెంటిమెంట్. అందుకే పదే పదే రవితేజ సినిమాలకు తమనే రిపీటవుతుంటాడు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న RT66 సినిమాకి తమన్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేశారు. గోపిచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు రవితేజ- గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన బలుపు సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఆ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కోసం మరోసారి శ్రుతిహాసన్ ని RT66 కోసం దించుతున్నారు. 

త్వరలోనే ఈ  సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాస్ రాజాతో మాస్ దర్శకుడు మాస్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసారు. ముందు ముందు ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియోట్ చేస్తారో చూడాలి. ఇక తమన్ ప్రస్తుతం రీప్లేస్ మెంట్ కి అవకాశం ఇవ్వకుండా ఆల్టర్నేట్ అన్నదే లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకరకంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం గట్టి పోటీ ఇస్తున్నాడు. అటు బన్ని అల వైకుంఠపురములో సినిమాకి చార్ట్ బస్టర్ మ్యూజిక్ ని ఇస్తున్నాడు. ఆ క్రమంలోనే వెంటనే మాస్ రాజా రూపంలో మరో ఛాన్స్ అందుకున్నాడు. ఈ స్పీడ్ చూస్తుంటే మరో ఐదారేళ్లు థమన్ టైమ్ కంటిన్యూ అయ్యోలా ఉందని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: