బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ పూర్తయింది. విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నాడు. శ్రీముఖి, రాహుల్ ఇద్దరు టాప్ 2లో ఉండగా ఫైనల్ గా రాహుల్ ను టైటిల్ విజేతగా ప్రకటించాడు నాగార్జున. అంతేకాదు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ టైటిల్ అందుకున్నాడు.  

 

15 మంది ఇంటి సభ్యులు మరో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇలా అందరిని దాటుకుంటూ వచ్చి టైటిల్ విజేతగా నిలిచాడు రాహుల్. రాహుల్ గెలవడంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా ఏవిధంగా అర్హుడు అంటూ కొందరు అప్పుడే ట్రోల్స్ మొదలుపెట్టారు. మొదట్లో టాస్క్ అంటే గివ్ అప్ ఇచ్చేసిన రాహుల్ ఆ తర్వాత పునర్నవి తోనే క్లోజ్ గా మూవ్ అయ్యాడు. 

 

అయితే పునర్నవి ఎలిమినేట్ అయ్యాక రాహుల్ తన గేమ్ స్టార్ట్ చేశాడు. ఒకసారి ఫేక్ ఎలిమినేషన్ అయ్యి వచ్చాక రాహుల్ క్రేజ్ డబల్ అయ్యిందని చెప్పొచ్చు. హౌజ్ లో వరుణ్,  వితిక, పునర్నవిలతోనే రాహుల్ ఎక్కువగా క్లోజ్ గా ఉన్నాడు. 

 

అయితే ఇప్పుడు ఎవరు ఎన్ని అనాలసిస్ లు చేసినా బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ విన్నర్ అయ్యాడు. దీన్ని మార్చడం కుదరదు కాబట్టి మెజారిటీ పీపుల్ ఓటింగ్ కు రెస్పెక్ట్ ఇవ్వక తప్పదు. రాహుల్ తో పాటుగా శ్రీ ముఖి ఫైనల్ వరకు టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇద్దరు స్నేహితులు మధ్య టైటిల్ పోరు జరుగగా ఫైనల్ గా రాహుల్ టైటిల్ గెలుచుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: