కన్నడ భామ రష్మిక మందన్న తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఇప్పటికే స్టార్ అవకాశాలు అందుకుంటున్న రష్మిక తమిళంలో కూడా ఇదే జోష్ కనబరుస్తుంది. ఓ పక్క మాతృ భాష కన్నడలో కూడా రష్మిక వరుస సినిమాలు చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటానో తనకే తెలియడం లేదని అందుకే ఒక సూట్ కేస్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. 

 

ఎక్కడికైనా వెళ్లాలంటే అది తీసుకుని వెళ్లడమే అంటుంది రష్మిక. అంతేకాదు ఏదో డబ్బులు ఇచ్చారు సినిమా చేసాం అన్నట్టుగా కాకుండా ప్రేక్షకులు స్పందన ఎలా ఉంటుందో అన్న ఎక్సయిట్ మెంట్ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది రష్మిక. సినిమాల్లో వరుస అవకాశాలు సంతోషాన్ని కలిగిస్తున్నా తన సినిమాల మీద తను ఒక్కోసారి బెంగ పెట్టుకుంటానని అంటుంది అమ్మడు. నటిస్తున్న సినిమాల గురించి ఆరా తీయడం కూడా తనకు అలవాటుగా మారిందని చెబుతుంది రష్మిక. 

 

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చేసిన నాలుగు సినిమాలతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న రష్మిక అల్లు అర్జున్ సుకుమార్ కాంబో సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీతో సుక్కు చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

 

మహేష్ సినిమా హిట్ అయితే ఇక అమ్మడికి వరుస స్టార్ అవకాశాలు రావడం ఖాయం. తమిళంలో కూడా రష్మిక తన సత్తా చాటుతుంది. కార్తీ తో సినిమా చేస్తున్న రష్మిక ఇళయదళపతి విజయ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని అంటున్నారు. చూస్తుంటే రష్మిక సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. అమ్మడి టాలెంట్ కు అది పక్కా అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: