తెలుగు లో వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు నేచురల్ స్టార్ నాని.  ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్ ’ తో మంచి విజయం అందుకున్న నాని తాజాగా  దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘V’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.  రెగ్యూలర్ మూవీస్ కాకుండా విభిన్న కథనాలతో అభిమానుల ముందుకు వస్తున్న నాని ఆ మద్య ‘జెర్సీ’ లాంటి క్రీడానేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 


ఈసారి రొటీన్ కి భిన్నంగా మరో పాత్రలో కనిపించబోతున్నాడట.  ‘V’ మూవీతో  బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవాలని కష్టపడుతున్నాడు నాని.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నట్లు టాక్. ఇక ఒక ముఖ్య పాత్రలో హీరో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాది ఉగాది ఫెస్టివల్ కి రిలీజ్ చేయాలనీ దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నివేద థామస్ - అదితీరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.


అనుకున్న సమయానికి ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ పూర్తయితే 2020 మార్చ్ 25న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తన కెరియర్లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని నాని భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: