టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ హీరోయిన్ గా కన్నా గతంలో పవన్ పై కామెంట్స్ చేస్తూ తెగ పాపులర్ అయ్యింది.   హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది. మొదట మోడలింగ్ లో రాణించిన పూనమ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన మూవీస్ లో నటించింది.

ఆ మద్య పూనమ్ కౌర్ వివాస్పద ట్వీట్ చేశారు. ఇది కూడా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రగడ కొనసాగింది. ఆమె కామెంట్స్ పై నెటిజన్లు సైతం ఇదే విషయాన్ని కామెంట్లలో రాస్తున్నారు.  మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిచకుండా విమర్శలు గుప్పించారు. నిన్న వైజాగ్‌లో పవన్ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ఆవేశంగా..ఆగ్రహంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పూనం కౌర్ తాజాగా మరో ట్వీట్ చేసింది. 'ఆగ్రహం అంటే పవర్ కాదు' (ANGER IS NOT POWER !!!...) అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో 'పవర్' స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా నటి శ్రీరెడ్డి సైతం పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకొని ఎన్నో కామెంట్స్ పెడుతున్న విషయం తెలిసిందే. 

దానికి కౌంటర్ గా జనసేన, పవన్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్వీట్ చూసిన పవన్ అభిమానులు పూనమ్ పై మండిపడుతున్నారు.   ధైర్యం ఉంటే పేరు మెన్షన్ చెయ్  అంటూ సవాలు విసురుతున్నారు. ఈ పోస్ట్ పెట్టడానికి ఎంత డబ్బు తీసుకున్నావంటూ సీరియస్ గా కామెంట్స్ పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: