పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత జనసేవ చేయాలని భావించి జనసేన పార్టీని స్థాపించారు. దీంతో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్ బై  చెప్పేశారు పవన్ కళ్యాణ్.అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపికి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారూ . కానీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు జనసేనాని. దీంతో రాజకీయాలను వదిలి మళ్ళీ  సినిమాల్లోకి వస్తారు  అని అందరూ అనుకున్నారు. కానీ తాను రాజకీయాల్లోకి రానని  తన జీవితం మొత్తం ప్రజలకే అంకితం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

 

 

 అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జోరుగా  జరుగుతుంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్  సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారని ఈ సినిమానీ  దిల్ రాజు నిర్మిస్తున్నారు అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను మళ్లీ నటిస్తే తప్పేముంది అంటూ అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలకు బలం చేకూరినట్లయింది . ఈ నేపథ్యంలో ఆయన సినిమాల్లో నటించడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అయితే తాను మళ్లీ నటించే విషయంలో ఇంకా క్లారిటీ కి రాలేదని... కానీ సినిమాలు  మాత్రం నిర్మిస్తా అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో అభిమానులు మరోసారి అయోమయంలో పడ్డారు. 

 

 

 

దీంతో  పవన్ కళ్యాణ్ నటనపై దృష్టి పెట్టారా లేక సినిమా నిర్మాణాలపై దృష్టి పెట్టారా అనే చర్చ మరోసారి మొదలైంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయంలో తెలిసిందే.  పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల్లో  రామ్ చరణ్...వరుణ్  తేజ్ హీరోగా నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తుంటే ఆయన నిర్మాణంలో మెగా హీరోలతో సినిమాలు చేయబోతున్నారని మరోమారు సందేహాలు కలుగుతున్నాయి. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న తరుణంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో సినిమా నిర్మాణం చేపడతారా...  నటిస్తారా అన్నది మరో ప్రశ్న గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: