ద‌గ్గుబాటి హీరో ఆడియ‌న్స్ మైండ్‌ని బ్లాక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. డిఫ‌రెంట్ షేడ్ క్యారెక్ట‌ర్స్‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న రానా యాంటీ క్లైమాక్స్‌తో రానా షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ యంగ్ హీరోల్లో రానా రూటే సెప‌రేటు అన్న‌ట్లు ఉంటుంది. ఓ వైపు హీరోగా కంటిన్యూ అవుతూనే మ‌రోవైపు ప్ర‌తినాయ‌కుడుగా మెప్పిస్తున్నాడు. ఇటీవ‌లె విడుద‌లైన బాలీవుడ్ హౌస్‌ఫుల్ చిత్రంలో రానా న‌టించిన నెగిటివ్ క్యారెక్ట‌ర్‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. అంతేకాదు సినిమా మొత్తంలో ఆ పాత్రే హైలెట్‌గా నిలిచింది. తాను న‌టిస్తున్న చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తే రానా ఎంత‌టి రిస్క్ చెయ్య‌డానికైనా రెడీ అంటున్నాడు. గ‌తంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా ది నెగిటివ్ క్యారెక్ట‌ర్ అయినా రానా ఏమాత్రం జంక కుండా న‌టించాడు. అసెంబ్లీలో బాంబ్ పెట్టి పేల్చేసి చివ‌రికి ఉరికి వేలాడుతాడు. ఆ స‌న్నివేశంలో న‌టించేందుకు ముందుగా జంకినా త‌ర్వాత ధ్యైర్యంగా ముంద‌డగు వేశాడ‌ట‌. రానా డేరింగ్‌కి ఆడియ‌న్స్ నుండి మంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం రానా న‌టించ‌బోయే కొత్త చిత్రం కోసం మ‌రోసారి అలాంటి రిస్క్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. 


ప్ర‌స్తుతం రానా వెంకీకుడుముల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ద‌గ్గుబాటి కుర్రాడు స్కూల్‌టీచ‌ర్‌, జ‌ర్న‌లిస్ట్ వంటి డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో న‌క్స్‌లైట్ గా న‌టిస్తుంది. అయితే  ఈ చిత్రంలో రానా తాను ప్రేమించిన ప్రియురాలిని షూట్ చేసి త‌న‌ను తాను షూట్ చేసుకుని చ‌నిపోతాడ‌ట‌. క‌థ డిమాండ్ మేర‌కు రానా ఈ సీన్‌లో న‌టించేందుకు సై అన్న‌ట్లు స‌మాచారం. ఈ సీన్‌కి థియేట‌ర్‌లో ఆడియ‌న్స్ నుండి చ‌ప్ప‌ట్లు త‌ప్ప‌వ‌ని డైరెక్ట‌ర్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నార‌ట‌. అంతేకాక రానా బాలీవుడ్ చిత్రం హాథీమేరీ సాథీలో కూడా న‌టిస్తున్నారు. మ‌రి ఇక ఈయ‌న సాహసాల‌కు ఎలాంటి హిట్స్ ల‌భిస్తాయో వేచి చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: