భారతీయ చలన చిత్ర రంగంలో అతి తక్కువ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి.  ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి’ మూవీ ఒకటి.  ఈ మూవీ లో నిజమైన దేవకన్య వచ్చిందా అన్నంత గొప్పగా నటించారు శ్రీదేవి.   ‘ఖైదీ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ రేంజ్ హిట్ కొట్టడం అంటే ఈ మూవీనే అని చెప్పాలి.  ఈ మూవీలో పాటలు ఇప్పటికే మారుమోగుతూనే ఉంటాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ కన్నా ముందు రెండు సినిమాలు దారుణమైన డిజాస్టర్స్ అయ్యాయి.  దాంతో ఇంత పెద్ద స్టార్స్ ని పెట్టి సినిమా తీస్తున్న ఈ మూవీ ఫెయిల్ అయితే తన కెరీర్ పూర్తిగా అగమ్యగోచరం అవుతుందని చాలా ఫిల్ అయ్యారట. వాస్తవానికి ఇలాంటి ఫాంటసీ మూవీస్  విఠలాచార్య లాంటి దర్శకులు చేస్తే జనం బాగా మెచ్చుకుంటారు... రాఘవేంద్రరావు చేసేది కాదు అనే విమర్శలు వినిపించాయి. తీరా సినిమా విడుదల కాగానే భయంకరమైన తుఫాను వచ్చేసింది.  అయితే తుఫాను కారణంగా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోతాయని భయపడ్డాను. 

సినిమా అయితే హిట్ టాక్ వచ్చింది..కానీ కలెక్షన్లు ఎలా అనుకుంటున్న సమయంలో అభిమానులు గొడుగులు వేసుకొని మరీ ఈ మూవీ వీక్షించడం చాలా సంతోషం అనిపించింది. కరెంట్ పోతే..థియేటర్స్ వారు జనరేటర్లపై సినిమాను నడిపించారు. కొన్ని ఊళ్లలో థియేటర్స్ లోకి నీళ్లు వచ్చేయగా, కుర్చీలపై కాళ్లు ముడుచుకుని కూర్చుని మరీ ఈ సినిమా చూశారు. నిజంగా అది ఒక రికార్డు  అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: