సిల్వర్ స్క్రీన్ పైన యువ సామ్రాట్‌గా, కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు అక్కినేని నాగార్జున. అలాగే బుల్లితెరపైన కూడా తన సత్తా చాటారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోతో హోస్ట్‌గా టెలివిజన్ రంగంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. వివాదాస్పద రియాలిటీ షో 'బిగ్ బాస్'కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. 'బిగ్ బాస్' సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగ్ వారంలో రెండు రోజులు (శని, ఆదివారం) టీవీలో కనిపిస్తూ సందడి చేశారు. అయితే, ఇలా వారానికి రెండు సార్లు కనిపించడానికి నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ రూ.5 కోట్లు అని తాజా సమాచారం.
 
'బిగ్ బాస్' షోను ప్రసారం చేసిన స్టార్ మా ఛానెల్ నాగార్జునకు ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వాస్తవానికి తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక హోస్ట్‌కు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. 'బిగ్ బాస్' సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎపిసోడ్‌కు రూ.10 లక్షలు ఇచ్చారట. ఆ తరవాత సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని కాస్త తక్కువ తీసుకున్నారట. కానీ, వీళ్లద్దిరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాగార్జున తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్. 

నాగార్జున 'బిగ్ బాస్' షోలో 30కి పైగా ఎపిసోడ్‌లలో కనిపించారు. షో కూడా బాగా సక్సెస్ అయ్యింది. దీంతో ఆయనకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ స్టార్ మా ఇచ్చారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగులో ఏ హోస్ట్ కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోలేదు. తొలి సీజన్ సుమారు 74 రోజులపాటు జరగడంతో ఎన్టీఆర్‌కు అందిన మొత్తం సుమారు రూ.2.5 కోట్లట. ఆ తరవాత సీజన్ 100 రోజులు నడిచినా నాని ఎపిసోడ్ రెమ్యునరేషన్ తక్కువ కాబట్టి.. ఆయన మొత్తంగా తీసుకున్నది సుమారు రూ.3 కోట్లని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరి కంటే నాగార్జున అందుకున్న రెమ్యునరేషనే ఎక్కువని అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: