బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ అందరి మనసులు గెలిచాడు. ముఖ్యంగా ఇంతకుముందు గెలిచిన కౌశల్ లాగా నేను తోపు అందుకే టైటిల్ గెలిచా అంటూ ఇంట్లో మిగతా వాళ్ల మీద విమర్శలు చేయకుండా సైలెంట్ గా టైటిల్ విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని.. అసలు తానిది ఊహించలేదని అన్నాడు రాహుల్.


ఇక హౌజ్ లో పునర్నవితో నడిపించిన లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఓ రకంగా రాహుల్ విన్నర్ అవడానికి పునర్నవితో చేసిన ఈ స్నేహమే కారణమని అంటున్నారు. వరుణ్, వితిక, రాహుల్, పునర్నవి ఈ నలుగురు ఒక గ్రూప్ గా ఉండి ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలిచారు. అయితే ఫైనల్ వరకు వచ్చిన వరుణ్ టాప్ 4లో నిలిచాడు.


హౌజ్ లో రాహుల్, పునర్నవిల మధ్య సంథింగ్ సంథింగ్ అన్నట్టుగా ప్రేక్షకులకు ప్రెసెంట్ చేశారు. అయితే ముందు బయటకు వచ్చిన పున్ను రాహుల్ తో ప్రేమ వ్యవహారం ఏం లేదని కేవలం మేమిద్దరం మంచి స్నేహితులమే అని చెప్పాడు. అయితే బయటకు వచ్చిన రాహుల్ కూడా అదే మాట చెబుతున్నాడు.


పునర్నవితో హౌజ్ లో ఎలాంటి రిలేషన్ లేదై. కేవలం మంచి స్నేహితులుగానే తాము ఉన్నామని చెప్పాడు రాహుల్. అయితే ఈ సందర్భంగానే పునర్నవి వేరే వాళ్లతో రిలేషన్ షిప్ లో ఉందన్న వార్తని చెప్పాడు రాహుల్. హౌజ్ లో కూడా తను డేట్ కు పిలిస్తే పునర్నవి రానని చెప్పిందని.. మీరంతా అనుకుంటున్నట్టుగా మా మధ్య ప్రేమ లేదని చెప్పాడు రాహుల్. బిగ్ బాస్ హౌజ్ లో 15 వారాల ప్రయాణంలో చాలా నేర్చుకున్నానని అన్నాడు రాహుల్. బిగ్ బాస్ 3 టైటిల్ విజేతగా గెలుపొందిన ప్రైజ్ మనీతో తల్లిదండ్రులకు ఇల్లు కొనిస్తానని అంటున్నాడు రాహుల్.




మరింత సమాచారం తెలుసుకోండి: