టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్  గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా సైరా నరసింహారెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన కెరియర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా తో తన నట విశ్వరూపం చూపించారు మెగాస్టార్ చిరంజీవి. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా  నిలిచింది. అయితే సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి కొబ్బరికాయ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కించబోతున్నారని  గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ పైకి  వెళ్లనున్నట్లు సమాచారం. అయితే మూడు నెలల్లోపు ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉందట. ఇదిలా ఉండగా కొరటాల శివ అంటేనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు మారుపేరు కాబట్టి చిరంజీవితో కూడా ఎలాంటి మెసేజ్ ఓరియంటడ్ సినిమాను  తెరకెక్కించబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పాటతో మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఎందుకంటే  గతంలో చిరంజీవి  రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలు మెగాస్టార్ డాన్సులతో అదరగొట్టిన అప్పటికి... తాజాగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో  మాత్రం చిరంజీవి డాన్సులు చేసేందుకు వీలులేకుండా పోయింది. 

 

 

 

 అయితే మెగాస్టార్ చిరంజీవి నుంచి అభిమానులు ఎక్కువగా డాన్స్ ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి తాజాగా కొరటాల శివ సినిమాలో  డాన్స్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ కూడా సైరా నరసింహారెడ్డి లో చిరంజీవి డాన్సులు  అభిమానులు చూడ లేక పోవడంతో దానిని  తన సినిమాలో భర్తీ చేయాలని అనుకుంటున్నాడట. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అవుతుంది. చిరంజీవి కెరీర్ లో ఎలాంటి హిట్ గా  నిలువబోతుందోనని  అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: