నిధి అగర్వాల్.. 'మున్నామైఖెల్‌'తో మొదట హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఇక‌ తెలుగులో అక్కినేని నాగ చైతన్య 'సవ్యసాచి'తో టాలీవుడ్‌కు పరిచయ‌మైన‌ ఈ బ్యూటీ అఖిల్‌తో `మిస్ట‌ర్ మ‌జ్ను` సినిమాలో కూడా న‌టించిది. కానీ ఈ రెండు సినిమాలు నిధికి పెద్దగా సక్సెస్ అదించ‌లేక‌పోయాయి. అయితే నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో నిధి నటకు మంచి మార్కులే ప‌డ్డాయి. 


అలాగే వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా  'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రెచ్చిపోయింది ఈ భామ‌. అయితే  అంత పెద్ద హిట్ ప‌డినా.. నిధికి మాత్రం అవకాశాలు గొప్పగా రావట్లేదు. దీంతో కాస్త ఆందోళనలో ఉన్న నిధి కొత్త ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.  రీసెంట్‌గా నిధి ఓ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్టు సమాచారం. ఓ డెబ్యూ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆ డెబ్యూ హీరో మరెవరో కాదు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్. దిల్ రాజు బ్యానర్ లో ఇంతకు ముందే సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. 


అయితే మళ్లీ ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నిధి ఓ రేంజ్ లో స్కిన్ షో చేయనున్న‌ట్టు తెలుస్తోంది. దీని కోసం భారీగానే రెమ్యూనరేషన్ పుచ్చుకోనున్నట్టు కూడా ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఎప్ప‌టికప్పుడు తన అందాలకు పదును పెడుతూ క్లీవేజ్ ట్రీట్ ఇచ్చి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్ర‌మంలోనే హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: