అను ఇమాన్యూల్ టాలీవుడ్ కి 2016లో నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయం అయ్యింది. అయితే అంతకముందే 'స్వప్న సంచారి' అనే మలయాళి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి మాత్రం కొద్ది మందికే తెలుసు. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో భాషల్లో కాస్త బిజీ అయ్యింది. అయితే చాలామంది హీరోయిన్స్
వచ్చిన అవకాశాలను ఉపయోకోవడంలో తడబడతారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఇవ్వాల్సిన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకనే రెండు మూడేళ్ళకే సర్దుకొని వెళ్ళిపోతున్నారు.  అను ఇమాన్యూల్ పరిస్థితి కూడా అలాగే తాయరైంది. 

అందుకు కారణం కెరీర్ ప్రారంభంలో తను తీసుకున్న నిర్ణయాల వల్ల కెరీర్ బాగా దెబ్బ తినిందని వాపోతోంది. సినిమాలో తన క్యారెక్టర్ ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు అంటూ రీసెంట్‌గా అను ఇమాన్యూల్ వెల్లడించింది. సినిమాలు ఎంచుకునే విషయంలో నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు నా పరిస్థితి ఇలా తయారైందని వాపోతోంది. అను పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' అల్లు అర్జున్ తో 'నాపేరు సూర్య' సినిమాలు చేయకపోయి ఉంటే ఈమె కెరీర్ ఇప్పుడు మంచి సక్సస్ ని అందుకొని బిజి బిజీగా ఉండేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. 

ఆ రెండు సినిమాలు చేయకుండా ఉంటే చిన్న సినిమాల్లో..యంగ్ హీరోస్ తో హీరోయిన్ గా కొనసాగుతూ మంచి హిట్స్ గనక నాలుగు పడితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునేదని చెప్పుకుంటున్నారు. అయితే ఇదే విషయంలో ఇంకొందరు మాత్రం ఆ రెండు సినిమాలు హిట్ అయితే అనూ స్టార్ హీరోయిన్ ఎప్పుడో అయ్యేదని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరస్తున్నారు. ఏదేమైనా మెగా హీరోస్ తో నటించిన ఆ రెండు సినిమాలు అను ఇమాన్యూల్ కెరీర్ ను పూర్తిగా టర్న్ చేశాయి. ప్రస్తుతం తమిళంలో ఒక చిన్న సినిమా తప్ప వేరే సినిమా అను చేతిలో లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: