టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విరించి వర్మ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మానుయేల్. నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ గా తన అందంతో ఆమె కుర్రాళ్ళ మతులు పోగొట్టింది అనే చెప్పాలి. ఇక ఆ తరువాత ఆమెకు రాజ్ తరుణ్ సరసన కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం లభించింది, అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం గోపీచంద్ సరసన ఆక్సిజన్ లో హీరోయిన్ గా నటించిన ఈ భామ, ఆ సినిమా కూడా ఫెయిల్ కావడంతో ఎంతో నిరాశ చెందింది. అయినప్పటికీ దాని తరువాత ఏకంగా పవర్ స్టార్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. అయితే అమ్మడు ఆశలు దాని ద్వారా కూడా తీరకపోగా, ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, కెరీర్ పరంగా అనుకు పెద్ద దెబ్బేసింది. 

ఇక అనంతరం వక్కంతం వంశి తొలిసారి దర్శకుడిగా అల్లు అర్జున్ తో తీసిన నా పేరు సూర్యలో అవకాశం సంపాదించినప్పటికీ, అనుకు ఆ సినిమా ద్వారా కూడా సక్సెస్ మాత్రం దక్కలేదు. కొన్నాళ్ళకు అక్కినేని వారబ్బాయి నాగచైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో దర్శకుడు మారుతీ అనుని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఘోరంగా పరాజయం పాలైంది. ఒకరకంగా తొలిసారి ఆమె హీరోయిన్ గా నటించిన మజ్ను తప్పించి తెలుగులో ఇప్పటివరకు ఈ భామ నటించిన మరొక సినిమా ఏది కూడా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగులో అసలు అవకాశాలు లేక, తమిళంలో శివకార్తికేయన్ సరసన నమ్మ వీటు పిళ్ళై అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అను సినీ లైఫ్ ఒక్కసారిగా ఇంత పతనం అవ్వడానికి ఆమె మెగా హీరోల సరసన నటించిన రెండు సినిమాలే కారణమంటూ కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 

అయితే అందుకు ఒక కారణం కూడా ఉంది, అదేమిటంటే, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో అను మాట్లాడుతూ, తన లైఫ్ లో తెలియక కొన్ని మిస్టేక్స్ చేసానని, వాటివల్లనే తనకు తెలుగులో పూర్తిగా అవకాశాలు కనుమరుగయ్యని చెప్పుకొచ్చింది. వాస్తవానికి తనకు పవన్ గారితో అలానే బన్నీ గారితో చేసిన సినిమాలపై ఎన్నో ఆశలు ఉన్నాయని, అయితే తన టైం బాగోకపోవడం వలన అవి రెండు సక్సెస్ కాలేదని చెప్పింది. కాగా ఆ విషయాన్ని పట్టుకుని, కేవలం పవన్ మరియు బన్నీల సినిమాల వల్లనే ఆమె సినిమా కెరీర్ ఇలా అయిందని అనడం తగదని, ఎందుకంటే ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో అనేది ముందే తెలిస్తే, అందరూ సక్సెస్ లే సాధిస్తారు కదా అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: