సినిమా వందరోజుల పండగలు ఎప్పుడో ఆగిపోయాయి. ఇంతకుముందు వంద రోజులు, నూట యాభైరోజులు, రెండు వందల రోజులు, ఇలా ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక సినిమా నెల రోజులు ఆడటమే కష్టంగా ఉంది. స్టార్ హీరో సినిమాలలో కొన్ని మాత్రమే యాభై రోజుల పండగని చేరుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సినిమా రికార్డులన్నీ కలెక్షన్ల రికార్డులకే పరిమితమయ్యాయి.


వారం రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందన్న దాని మీదనే సినిమా హిట్టా ఫట్టా అనేది తేలిపోతుంది. అయితే ఈ మధ్య మరో వింత సంస్కృతి మొదలైంది. సినిమా టీజర్, ట్రైలర్లు యూట్యూబ్ లో విడుదల అవుతుంటాయి. యూట్యూబ్ వ్యూస్, లైక్స్, షేర్స్ కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బిగిల్ సినిమాకి రెండు మిలియన్ల లైకులు సాధించిన తమిళ చిత్రంగా రికార్డుకెక్కింది.


అయితే ఈ రికార్డుల్లో నిజమెంత, అబధ్ధమెంత అన్న సంగతి తెలిసే అవకాశం లేదు. హీరోని అభిమానించే వారు పని గట్టుకుని లైక్స్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అలాంటి మరో రికార్డు ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది.పునీత్ హీరోగా న‌టించిన కొత్త చిత్రం యువ‌ర‌త్న టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. ర‌గ్బీ నేప‌థ్యంలో సాగే ఈ టీజ‌ర్లో హీరోయిజం బాగానే ఎలివేట్ అయింది.


మ‌న త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్ బాగానే కిక్కు ఇచ్చింది. ఐతే క‌న్న‌డ సినిమాల‌కు సౌత్ ఇండియా స్థాయిలో వ్యూస్, లైక్స్ రికార్డులు రావ‌డ‌మంటే క‌ష్టం. అందుకే పునీత్ అభిమానులు కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. యూట్యూబ్‌లో టీజ‌ర్‌కు కామెంట్ల మోత మోగించారు. అవి ల‌క్ష మార్కును అందుకున్నాయి. ద‌క్షిణాదిన ఒక టీజ‌ర్‌కు ల‌క్ష కామెంట్లు రావ‌డం ఇదే తొలిసారి అంటూ దాన్ని గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంటున్నారు పునీత్ ఫ్యాన్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: