మాస్ మహారాజ
రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా
సినిమా డిస్కోరాజా. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు విఐ
ఆనంద్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరించే కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
రవితేజ ఒక వెరైటీ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.
రవితేజ సరసన పాయల్
రాజ్ పుత్, నభ నటేష్
హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో
రవితేజ లుక్ తో పాటు, ఒక లిరికల్ సాంగ్ మరియు విలన్ గా
బర్మా సేతు అనే పాత్రలో నటిస్తున్న బాబీ
సింహ అఫీషియల్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ చేసిన సినిమా యూనిట్, వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో,
త్వరలో రిలీజ్ కాబోయే
సినిమా కూడా మంచి
సక్సెస్ సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొదట
డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ వాయిదా వేయడం జరిగింది. ఇక కాసేపటి క్రితం ఈ
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు అఫీషియల్ సినిమా రిలీజ్ డేట్స్ ని యూనిట్ అనౌన్స్ చేసింది. దాని ప్రకారం, టీజర్ ని
డిసెంబర్ మొదటి వారంలో అలానే సినిమాను
2020 జనవరి 24న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా,
ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
రామ్ తాళ్లూరి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే గతంలో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన
రాజా ది గ్రేట్ తరువాత మరొక హిట్ లేకపోవడంతో, ప్రస్తుతం నటిస్తున్న ఈ డిస్కోరాజా తన కెరీర్ కు మంచి బ్రేక్ ని ఇస్తుందని రవితేజ భావిస్తున్నారట. ఇప్పటికే
టాలీవుడ్ వర్గాల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ
సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర
సక్సెస్ ని అందుకుని రవితేజకు
సక్సెస్ బాటలు వేస్తుందో చూడాలి మరి...!!