సూపర్ స్టార్ రజనీ కాంత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు నంబర్ వన్ స్టార్ హీరో. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పటికి రజనీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్స్ కోట్లలోనే ఉన్నారు. ముఖ్యంగా రజనీ స్టైల్ కి ఎవరైనా ఫ్లాటవ్వాల్సిందే. కె.బాలచందర్ దర్శకత్వంలో 'ఆపూర్వ రాగంగళ్' సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదిగారు. అంతులేని కథ, వయసు పిలిచింది, ఆమే కథ, అన్నదమ్ముల సవాల్..ఇలా మొదలైన రజనీ ప్రయాణం దళపతి, ముత్తు, నరసింహ, భాషా, పెదరాయుడు, అరుణాచలం, చంద్రముఖి, శివాజి వంటి బ్లాక్ బస్టర్స్ తో దాదాపు 160 కి పైన సినిమాలలో నటించారు. 

ఇక రజనీకాంత్ పా. రంజిత్ దర్శకత్వంలో నటించిన కబాలి లో రజనీ మేకోవర్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక డిఫ్రెంట్ మేనరిజం తో అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో రజనీ ఫెంటాస్టిక్ అనిపించారు. ఆ తర్వాత కాలా, పేట, రోబో 2.ఓ సినిమాల ఫలితం ఎలా ఉన్నా రజనీ క్రేజ్ మాత్రం.. ఏమాత్రం తగ్గలేదు. అందులో భాగాంగానే వరుసగా సినిమాలను చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నారు. యంగ్ హీరోసన్నా ఒక్క ఫ్లాప్ పడగానే భయంతో మళ్ళీ సినిమా చేయడానికి ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక కనీసం సంవత్సరం సమయం తీసుకుంటున్నారు. కానీ రజనీ దారి రహదారి..అందుకే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు.  

ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించిన దర్బార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సూపర్ స్టార్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడానికి నాలుగు ఇండస్ట్రీస్ లో ఉన్న స్టార్ హీరోలు కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనడం. హిందీ లో దర్బార్ పోస్టర్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ఇక తమిళ్ పోస్టర్ ను లోకనాయకుడు కమల్ హాసన్ రిలీజ్ చేయగా, మలయాళం పోస్టర్ ను మోహన్ లాల్ రిలీజ్ చేశారు. అలాగే తెలుగు మోషన్ పోస్టర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ కేరళలో ఉన్నారు. అక్కడి నుంచే రజనీ దర్బార్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక సూపర్ స్టార్ కోసం ఇంతమంది సూపర్ స్టార్స్ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్.


మరింత సమాచారం తెలుసుకోండి: