యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా రూలర్. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్, బాలయ్యతో తీస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, మరొక్కసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినపడుతోంది. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే మాస్ పోలీస్ ఆఫీసర్ ధర్మ అనే పాత్రలో బాలయ్య లుక్స్ రిలీజ్ అయి ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెంచాయి. 

బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను సి కళ్యాణ్ తన హ్యాపీ మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే కాసేపటి క్రితం ఈ సినిమాలో బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్ లో బ్లాక్ కలర్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్ మరియు లేటెస్ట్ స్టైల్ జీన్స్ ధరించి కూలింగ్ గ్లాసెస్ తో ఎంతో స్టైల్ గా దిగిన ఒక పిక్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది సినిమా యూనిట్. రిలీజ్ అయిన వెంటనే ఈ లేటెస్ట్ లుక్ పోస్టర్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. 

ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండూ కూడా ఫ్లాప్ కావడంతో కొంత నిరాశ పడిన బాలయ్య ఫ్యాన్స్, ఈ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు అనే చెప్పాలి. అతి త్వరలో టీజర్ ని రిలీజ్ చేసి, సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న చేయాలని నిర్ణయించింది సినిమా యూనిట్. మరి వరుసగా రెండు ఫ్లాప్స్ చూసిన బాలయ్య, ఈసారి ఎంతవరకు హిట్ అందుకుంటారో చూడాలి..... !! 


మరింత సమాచారం తెలుసుకోండి: