మెగాస్టార్ చిరంజీవి జోరు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే మంచి స్పీడ్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఖైదీ నెంబర్ 150 మరియు 'సైరా' సినిమాలతో అదిరిపోయే రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కి చిరంజీవి కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.


రెండు తెలుగు రాష్ట్రాలలో కళ్ళు చెదిరే విధంగా ముఖ్యంగా నైజాంలో తన మార్కెట్ ఏంటో ఈ సినిమా కలెక్షన్ల ద్వారా నిరూపించారు చిరంజీవి. అయితే సైరా సినిమా కి దాదాపు రెండు సంవత్సరాలపాటు టైం కేటాయించడంతో తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో చేయబోయే సినిమా కోసం చిరంజీవి టైం ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా కొరటాలతో చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన సినిమా యూనిట్...డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించడం జరిగింది.


దీంతో ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో చిరంజీవి ఉండటంతో..ఇటీవల కొరటాల చిరంజీవిని చూసి ఇంకా బరువు తగ్గాలని సూచించడంతో జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కేవలం నాలుగు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేయాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు వచ్చే వేసవి కల్లా మెగా అభిమానులకు ఈ సినిమా అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవిసినిమా షూటింగ్ కోసం బరువు తగ్గే పనిలో జిమ్ లో బాగా వర్క్ అవుట్ లు స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: