మన అభిమాన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ కు  వెళ్లి చూస్తాం ... కొన్ని రోజులు అయిన తర్వాత కొత్త సినిమాలు రావడంతో ఆ సినిమా థియేటర్ నుంచి తీసేశాక మళ్ళీ చూడాలనిపిస్తే  ఏం చేస్తాం.... అమెజాన్ ప్రైమ్ అండగా టెన్షన్ ఎందుకు దండగ అని అనుకుంటుంటాం . ప్రస్తుతం అన్ని సినిమాలకు డిజిటల్ మార్కెట్ పెరగడంతో ఆయా సినిమాల రెవెన్యూ వాటి మార్కెట్ విలువ కూడా పెరిగిపోతుంది. అయితే ఈ విషయంలో తెలుగు నిర్మాతలు ఆనంద పడుతున్నప్పటికీ... మరొక కోణంలో మాత్రం నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా విడుదలై బాగా వసూలు చేస్తున్న తరుణం లో విడుదలైన కొన్ని రోజులకే ఆ సినిమాకి థియేటర్లో మంచి కలెక్షన్లు వస్తున్నప్పటికీ ఆన్లైన్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్  అవ్వడంతో ఎంతో  దూరం వెళ్లి థియేటర్లో సినిమా చూడడం కన్నా అదే క్లారిటీతో మన చెంతనే సినిమా అందుబాటులో ఉంటుంది అంటూ సినిమాలకు వెళ్లడం మానేస్తున్నారు సగటు ప్రేక్షకులు. 



 ఇక థియేటర్లకు ప్రేక్షకులు రాకపోడంతో నిర్మాతల నుండి సినిమా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనికి అసలైన ఉదాహరణ నాని గ్యాంగ్ లీడర్. అయితే నాని గ్యాంగ్ లీడర్ విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ వైపు థియేటర్ లో ఆడుతుండగానే   మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో లో  అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి తెలుగు నిర్మాతలు సమావేశమై... విడుదలైన ఏ సినిమానైనా విడుదల అయిన నాటి నుంచి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత డిజిటల్ మాంద్యమంలో  విడుదల చేయాలని నిర్ణయించారు . అయితే ఇలాంటిదే మరో సారి జరిగింది. అయితే ఈ సారి తెలుగు సినిమా విషయంలో కాదు తమిళ సినిమా విషయంలో. 



 తాజాగా ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అసురన్ . దళిత కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయాలని అనుకున్నట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా అసూరన్  సినిమా విడుదలై నెలరోజులు కాకముందే అప్పుడే అమెజాన్ ప్రైమ్  లో వచ్చేసింది  ఈ సినిమా. దీంతో థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించాలి అనుకునే ప్రేక్షకులు ఆన్లైన్లోనే చూసేస్తున్నారు. దీంతో తెలుగులో రీమేక్ చేయాలని భావించిన నిర్మాతలు  కూడా ఈ విషయంపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో డిజిటల్ మాధ్యమాల పేరుతో నిర్మాతలు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: