టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు  సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ ఏం చేసినా అందులో వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏ మాట మాట్లాడినా అది వివాదానికి దారితీస్తుంది . అందుకే ఆయన్ను వివాదాల  దర్శకుడు అంటూ పిలుచుకుంటారు. అయితే ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా వివాదాలకు మారుపేరు గా ఉంటాయి . వర్మ ఏ సినిమా తెరకెక్కించిన అందులో ఓ వివాదాస్పద  అంశాన్ని తెరమీదికి తెచ్చి సినిమాని తెరకెక్కిస్తుంటారు  దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఎన్నో సంచలన వివాదాస్పద సినిమాలను తెరకెక్కించి సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అయితే వర్మ ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తాడు అన్నది ఎవరు చెప్పలేరు. ఒక దర్శకులందరిది ఒక  దారైతే రాంగోపాల్ వర్మ ది  సపరేటు రూటు . వివాదాలు  దర్శకుడు రాంగోపాల్ వర్మ చుట్టూ తిరుగుతాయా... లేక రామ్ గోపాల్ వర్మ వివాదాల చుట్టూ  తిరుగుతారా అని అనుకుంటారు  అందరూ. 



 అయితే తాజాగా మరో సెన్సేషనల్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ  తెరలేపాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ఒక వివాదాస్పద టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలన్నింటినీ తన సినిమాలో చూపించబోతున్నట్లు  ఇప్పటికే వర్మ  క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ని ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు ట్రైలర్ లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రం నుంచి పప్పు లాంటి అబ్బాయి అనే పాటను విడుదల చేశారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పప్పు లాంటి అబ్బాయి అనే పాట మరో వివాదానికి తెరలేపేలా ఉంది. 



 కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో  ఇదిగో ఇది తండ్రి కొడుకుల మధ్య  ప్రేమను తెలిపే పాట... ఇందులో తొలి పార్టీ  తండ్రి కోణంలో...  రెండో పార్టీ  కుమారుడు కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు  ఎవరినైనా పోలీ  ఉన్నాయనిపిస్తే   అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అంటూ వర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ విడుదల చేసిన పప్పు లాంటి అబ్బాయి అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్  వర్మ... తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు  అనే సినిమాను విడుదల చేసి మరో సారి  ఎలాంటి సంచలనం సృష్టిస్తారో  చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: