మెగాస్టార్ చిరంజీవి కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే హీరోలందరికి  మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ గా  ఉంటారు . తెలుగు సినిమా అభిమానులు అందరూ మెగాస్టార్ స్టైల్ అంటే పడి చచ్చిపోతారు . అందుకే రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కూడా మెగాస్టార్ క్రేజ్ తగ్గలేదు. తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు. సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వరుస  సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు . హిట్టు ఫ్లాప్ లతో  సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. 



 అయితే ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ప్రస్తుతం సినిమాల విషయంలోనే కాదు ఇప్పుడు బరువు తగ్గే విషయంలో కూడా పోటీపడుతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నారు . అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ మరి స్లిమ్ గా  మారిపోయాడు. బాలకృష్ణ స్లిమ్ గా  ఉన్న ఫోటో నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. స్లిమ్ గా స్టైలిష్ లుక్ తో  అదరగొడుతున్న బాలకృష్ణ...యంగ్ హీరోలకు  సైతం పోటీ ఇచ్చే లాగా కనిపిస్తున్నారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బరువు తగ్గాలని బాలకృష్ణకు  సూచించగా... బోయపాటి  సినిమా కోసం చేసిన వర్కౌట్స్  కాస్త రూలర్ సినిమా కోసం బాగా ఉపయోగ పడ్డాయి . 



 మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్కడా తగ్గడం లేదు. సైరా నరసింహారెడ్డి విజయం తర్వాత ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ స్లిమ్ గా ఉన్న ఫోటో లు  కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో చూసిన వాళ్ళు  మెగాస్టార్ కి 64 ఏళ్లు ఉంటాయి అని మాత్రం అనుకోరు .కొరటాల  శివ సినిమాలో పాత్ర కోసం బరువు తగ్గాలని చిరంజీవికి సూచించగా ... మెగాస్టార్ చిరంజీవి జిమ్ లో  బాగానే కష్టపడుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోలు బరువు తగ్గుతూ యంగ్  హీరోలకు సైతం పోటీ ఇచేలా కనిపిస్తున్నారు.
-


మరింత సమాచారం తెలుసుకోండి: