మలైకా అరోరా సైలెన్స్ కు బ్రేకులేసింది. ఇన్నాళ్లు నో కామెంట్ అన్న మలైకా అరోరా ఫైనల్ గా పెళ్లిపై పెదవి విప్పింది. బయట జరుగుతోన్న డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు మళ్లీ పెళ్లి చేసుకునే విషయంపై మాట్లాడింది మలైకా అరోరా. 


మలైకా అరోరా, అర్జున్ కపూర్ డీప్ రిలేషన్ లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఈ ప్రచారాలపై పెదవి విప్పకపోయినా, కెమెరాలకు పని చెబుతూనే ఉన్నారు. ఫారిన్ ట్రిప్పులతో బాలీవుడ్ కు హింట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా మలైకా అరోరా, అర్జున్ ఇద్దరూ ముంబైలో ఓ క్లినిక్ దగ్గర ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీంతో బయట రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. 


మలైకా అరోరా, అర్జున్ కపూర్ క్లినిక్ బయట కనిపించడంతో ఏదో జరిగిందని అంతా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇంకా సైలెంట్ గా ఉంటే భారీ డ్యామేజ్ జరుగుతుందని భయపడుతోందట మలైకా. ఈ భయంతోనే నేహా ధూపియా షోలో పెళ్లి కోరికలు బయటపెట్టింది మున్నీ. 


మలైకా అరోరా బీచ్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆశ పడుతోందట. కంప్లీట్ వైట్ థీమ్ లో ఏంజెల్ లా కాబోయేవాడికి రింగు తొడగాలనుకుంటోందట మలైకా. అయితే వెడ్డింగ్ ప్లాన్ గురించి చెప్పిన మలైకా, అర్జున్ కపూర్ విషయంలో మాత్రం సిల్లీ ఆన్సర్స్ ఇచ్చింది. అర్జున్ ఫోటోస్ బాగా తీస్తాడనీ, అందుకే టూర్స్ కు వెళ్లినపుడు అర్జున్ కంపెనీ తీసుకుంటానని చెప్పింది. దీనికి మలైకా క్యాలీ ఫ్లవర్స్ తోటలు పెంచుతోందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్ లు. మొత్తానికి మలైకా అరోరా.. నోట పెళ్లి మాట వచ్చేసింది. ఇన్నాళ్లూ లవ్, మ్యారేజ్ గాసిప్స్ పై వచ్చిన కామెంట్స్ కు ఆమె నుంచి సరైన సమాధానం లేదు. ఎపుడైతే క్లినిక్ దగ్గర దొరికిపోయిందో.. ఇపుడు ఖచ్చితంగా నోరు విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అసలు విషయాన్ని చెప్పకనే చెప్పింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: