తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే, తమిళంలో ఆయన హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. ఈ సంవత్సరం రెండు సినిమాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకటి 'ఎన్జీకే', మరొకటి 'బందోబస్త్'. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈసారెలాగైనా గట్టి హిట్ కొట్టాలని కొత్త సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య.

తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో 'గురు' వంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో 'సూరరై పోట్రు' టైటి‌ల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో 'ఆకాశం నీ హద్దురా!' అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళ ఫస్ట్‌లుక్ పోస్టర్లను హీరో సూర్య ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్స్ నుండి రక రకాల కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫస్ట్ లుక్ మరీ అంత కొత్తగా లేదే అన్న టాక్ వినిపిస్తుంది.  

ఇక ఈ సినిమాకు సూర్య నే నిర్మాత కావడం విశేషం. సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ తో కలిసి 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్టున్నారు. అటు తమిళంలో కూడా ఈ మధ్య ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్య కి ఈ సినిమా హిట్ ఎంతో కీలకం. ఇక సూర్య కి వరుస ఫ్లాప్స్ వల్ల తెలుగులో మార్కెట్ బాగా పడిపోయింది. మరి ఈ సినిమా మళ్ళీ సూర్య మార్కెట్ ని పెంచుతుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: