బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ని గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ పేరు ఎలా మారుమ్రోగిందో.... బిగ్ బాస్ హౌస్ లో అతనితో స్నేహం చేసిన పునర్నవి భూపాలం పేరు కూడా బానే వినపడింది. బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందంటూ అనేకమైన వార్తలు వచ్చాయి. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే పుకార్లు రావడంతో... ఈ వార్తలపై స్వయంగా రాహుల్ సిప్లిగంజ్ యే తన పెదవి విప్పి మా మధ్య మంచి స్నేహ బంధం కంటే మరేమి లేదని చెప్పాడు.


నిజానికి రాహుల్ సిప్లిగంజ్-పున్ను బేబీ మధ్య ఉన్న కెమిస్ట్రీ వలనే బిగ్ బాస్ షో కి ఎక్కువ వ్యూస్ వచ్చాయని సమాచారం. అందువల్ల ఈ జంట కి ఉన్న క్రేజ్ తో ఒక సినిమా తీస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. దీన్నే ఉద్దేశిస్తూ.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూ లో రాహుల్ ని....'పునర్నవితో సినిమా అవకాశం వస్తే హీరోగా నటిస్తావా?' అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. 'కచ్చితంగా నటిస్తాను.. పున్ను బేబీతో సినిమా చేయడానికి అవకాశం వస్తే 110 పర్ సెంట్ ఆ సినిమాలో నటిస్తా' అని చెప్పాడు. 


ఈ సమాధానంతో లైన్ క్లియర్ అవ్వడంతో దర్శక నిర్మాతలు త్వరలనే ఈ జంటతో ఓ రొమాంటిక్ సినిమా తీసే అవకాశాలు ఫుల్ల్ గా ఉన్నాయని స్పష్టమవుతుంది. బిగ్ బాస్ షో తో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ జంట ఓ సినిమా తీస్తే సంతోషపడేవారు కోకొల్లలు. పునర్నవి ని కూడా తన అభిమానుల కోసమేనా రాహుల్ తో సినిమా తీయడానికి ఓకే చెప్పేస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: