ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో చాలా వరకు డూప్ లు నటించేవారు. కానీ ఈ మద్య హీరోలు కొన్ని రిస్కీ సన్నివేశాల్లో తామే స్వయంగా నటిస్తామని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నా కొన్ని సందర్భాల్లో హీరోలకు గాయాలు కావడం చూస్తూనే ఉన్నాం. ఆ మద్య మంచు విష్ణు
బైక్ పై నుంచి పడిపోయి దారుణమైన దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత గోపించంద్ ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా తీవ్రంగా గాయపడి రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాడు. కొన్ని సార్లు స్వల్ప గాయాలే అయినా..నెలల తరబడి రెస్ట్ తీసుకునే పరిస్థితి నెలకొంటుంది.
తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి యాక్షన్ సీన్లో గాయం అయ్యింది. కానీ ఆయన ఆ గాయాన్ని లేక్కచేయకుండా ప్యాచ్ వేసుకొనే షూటింగ్ లో పాల్గొంటూ తన పని పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. ముంబయిలో జరుగుతోన్న ‘సూర్యవంశి’ సినిమా షూటింగ్ సెట్స్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎడమ చేతికి గాయమైంది. అయితే డాక్లర్ట సలహా మేరకు ఆయనకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ తన వల్ల షూటింగ్ ఆగిపోవొద్దని..షెడ్యూల్ టైమ్ ఇచ్చిన వారికి తర్వాత ఇబ్బంది అవుతుందని గాయానికి ప్యాచ్ వేసుకొనే షూటింగ్ లో పాల్గొన్నారు.