జబర్దస్త్ యాంకర్ అనసూయని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన మంచి గాత్రంతో ముచ్చటవేసే ముఖకవళికతో అందర్నీ కట్టిపడేస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇక హైపర్ ఆది జబర్దస్త్ షో ద్వారా అతని సృజనాత్మక పంచులతో తక్కువ కాలంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు.
 
ఇలాంటి వీరిద్దరి పై కొంత కాలం గా ఎన్నో నిరాధారమైన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న జబర్దస్త్ షో లో అనసూయ హైపర్ ఆది మధ్య సంభాషణలు హద్దులు మీరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆది ఓ స్కిట్ చేస్తూ ఆడవేషం వేసిన ఓ కంటెస్టెంట్ ని ముద్దు అడుగుతాడు... అందుకు ఆ కంటెన్స్టెంట్ నో అనడంతో.. ఆది నేను ఇస్తా అంటూ అనసూయ తన సీట్ నుంచి లేస్తుంది. 


ఆ విషయాన్నీ పక్కన పెడితే, ఆమె కేవలం ఆది తో మాత్రమే ఎంట్రీ సాంగ్స్ లో అనేక మార్లు డాన్స్ వేసింది. ఆది స్కిట్ వస్తే చాలు ఆమె ముఖంపై చిరునవ్వులు తన్నుకొస్తాయి. ఆది కూడా తన ప్రతి ఒక్క స్కిట్ లో అనసూయ అందం గురించి పొగుడుతూ ఉంటాడు. ఆమె ఆ ఆది వేసే బిస్కట్ల కి తెగ సిగ్గులొలికిస్తుంది. ఇక ఇవన్నీ చూస్తున్న జబర్దస్త్ వ్యూయర్స్ వారిద్దరి మధ్య కచ్చితంగా ఏదో నడుస్తుందని పలు రకాల ఊహాగానాలు చేసుకుంటారు. 


ఆ ఉహాగానాలన్నటిని దృఢపరిచేలా తాజాగా రిలీజ్ అయినా జబర్దస్త్ ప్రోమోలో వీరిద్దరు జబర్దస్త్ వేదికపై బైక్‌పై షికార్లు చేశారు. అనసూయ బైక్ నడుపుతుంటే... ఆది వెనుక కూర్చొని రైడ్ కి వెళ్తాడు. అయితే ఇవన్నీ చేయించేది జబర్దస్త్ నిర్వాహకులు అని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. రష్మీ సుధీర్ మధ్య బంధం పై ఎన్నో వార్తలు వచ్చి అవి బోరింగ్ గా అయిపోవడంతో.....మళ్ళీ హైప్ పెంచే ఉద్దేశంతో అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది మధ్య అఫైర్ ని అంటగడుతున్నారంట. పెళ్ళై పిల్లలున్న అనసూయ షో కోసం ఇలా చేయడం తన అభిమానులను నిరాశకు గురిచేస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: