మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు చాలా స్పీడ్ గా సినిమాలు చేసేవారు. అప్పట్లో హీరోయిన్లుగా వచ్చిన రంభ, సౌందర్య  వంటి వారితో చిరంజీవి జంట కట్టారు. అదే వరసలో అప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు  తెచ్చుకుని  అందాల రాశి గా పేరున్న రాశితో కూడా చిరంజీవి ఒక సినిమాకు కమిట్ అయ్యారట. ఆ సినిమాలో రాశి, ఆర్తి అగర్వాల్  హీరోయిన్స్. దీని మీద చిత్ర యూనిట్ కూడా పేపర్ స్టేట్మెంట్  కూడా ఇచ్చింది. 


మరి ఇంతలో  ఏం జరిగిందో కానీ ఆ సినిమా రాశి మిస్ అయింది. ఆలీ తో సరదాగా ప్రోగ్రాంలో ఫ్లాష్ బ్యాక్ చెబుతూ రాశి ఈ ముచ్చటను ప్రస్తావించింది. చిరంజీవి కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ తో తాను గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా వేయడానికి కూడా చిరంజీవి సతీమణీ సురేఖ కారణమని రాశి ఆసక్తికరమైన సంగతులు వెల్లడించింది. 


ఇక చిరంజీవి గ్యాంగ్ లీడర్ హిందీలో ఆజ్ కా గూండారాజ్ గా తీస్తే అందులో  చిరంజీవి అన్నయ్య కూతురుగా నటించానని కూడా వెల్లడించింది. ఇక చిరంజీవి పక్కన హీరోయిన్ గా చాన్స్ వస్తే  ఎగిరి గంతేశానని ఆమె చెప్పుకుంది. మరి ఏం జరిగిందో ఆ చాన్స్ పోయిందని, లేకపోతే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తాను ఉండేదాన్ని అమె  గతాన్ని తలచుకుంది.


ఇక బాలక్రిష్ణతో బాల గోపాలుడు మూవీతో నటించిన తాను పదేళ్ళ తరువాత కిష్ణ బాబు మూవీలో హీరోయిన్ గా చేయడం గొప్ప అనుభవంగా చెప్పుకుంది. తనకు నచ్చని డైరెక్టర్ తేజా అని చెబుతూ నిజం సినిమా లేడీ విలన్ క్యారక్టర్ తనకు నచ్చని పాత్ర అన్నారు. మొత్తానికి రాశి మెగా కాంబో ఎందుకు మిస్ అయిందో కానీ ఈ జంట నటిస్తే కన్నుల పంటగా అప్పట్లో ఉండేదన్న వారూ ఇప్పటికీ  ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: