ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం లో అనూహ్య మార్పులు తీసుకురావాలని సంకల్పించారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పాదయాత్రలో పేద ప్రజలను, గ్రామీణ ప్రాంత వాసులను దగ్గర నుండి చూడటం తో వారి కష్టాలు, ఎదగలేకుండా ఉండటానికి గల కారణాల్ని తెలుసుకున్నారు. ఉన్నతమైన విద్య ద్వారా మాత్రమే వీరి జీవితాలు మార్చవచ్చు అనుకొని, ఆనాడే ప్రజలకు హామీ ఇచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన పూర్తిగా ఆంగ్ల లో కొనసాగుతుందని.. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసే కార్యక్రమాన్ని అమలుచేస్తామని జగన్‌ ప్రకటించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ విషయం పై హాట్‌ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామందే సమర్థిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరో డా.రాజశేఖర్ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


సోష‌ల్ మీడియా ట్విట‌ర్ ద్వారా ఆయ‌న స్పంద‌న‌ను తెలిపారు. ‘ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా సరైన నిర్ణయం అని.. ప్రస్తుత కాలంలో జాబ్స్ సంపాదించాలంటే.. సరిగ్గా కమ్యూనికేట్ చేయాలన్నా ఆంగ్లంలో మాట్లాడటం ఏంతో అవసరమన్నారు. ఇంగ్లీష్ సరిగ్గా రానందువల్లే పై చదువుల్లో, ఉద్యోగాల సాధనలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని.. అయితే మన మాతృ భాష తెలుగును కూడా తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేర్చాలని.. ఏమైనా విద్య మాత్రం ప్రతి ఒక్కరికీ సమానంగా అందాలని.. ఆ దిశగా ఈ నిర్ణయంతో మొదటి అడుగు పడిందని డా.రాజశేఖర్ పోస్ట్ చేశారు. ఏది ఏమైనప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి చాలా మంది స‌మ‌ర్ధిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సీఎంకి ఇలాంటి ఆలోచ‌న రాలేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: