అయితే
మహేష్, బన్నీల సినిమాలు మాత్రం ఒకేరోజున థియేటర్స్ లోకి వస్తుండడంతో వాటిని కొన్న బయ్యర్ల మనసులో మాత్రం లోలోపల కొంత ఆందోళన నెలకొని ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే, ఈ ఇద్దరూ కూడా బడా స్టార్స్ కావడంతో ఇద్దరి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే, రెండు సినిమాల్లో ఏ ఒక్కదానికి కూడా చెప్పకోదగ్గ ఓపెనింగ్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉండదని, ఎందుకంటే రెండు సినిమాలకు కూడా సమాన థియేటర్స్ కేటయించడంతో కెలెక్షన్స్ ఇద్దరి హీరోల సినిమాలు కూడా పంచుకోవలసి వస్తుందని అంటున్నారు. అదే కనుక ఈ రెండిటిలో ఏదో ఒక
సినిమా, ఒకరోజు ముందుగాని, లేదా తరువాత కానీ రిలీజ్ అయితే,
రెండిటికి ఫస్ట్ డే ఓపెనింగ్స్ తప్పకుండా అదిరిపోతాయని వారు అభిప్రాయపడుతున్నట్లు
టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ ఇద్దరు హీరోలతో పాటు వాటి ప్రొడ్యూసర్స్ కూడా ఒక్క అడుగు వెనుకకు వేసేది లేదని, అనుకున్న ప్రకారమే తమ తమ సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయని భీష్మించుకు కూర్చున్నారట. అయితే దీనిపై కొందరు
సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, ఈ రెండు సినిమాల విడుదలకు మరొక రెండు నెలల సమయం ఉంది కాబట్టి, అవకాశం ఉన్నంతవరకు రెండు సినిమాల నిర్మాతలు కనుక ఒకసారి కూర్చుని చర్చించి, రెండిటికి కనీసం ఒక్కరోజైనా గ్యాప్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. మరి ఈ రెండు సినిమాల విషయమై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.....!!