గతంలో అడల్ట్‌ మూవీ స్టార్‌ గా పాపులర్ అయిన మియా ఖలీఫా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు స్వీడిష్‌ చెఫ్‌ అయిన రాబర్ట్‌ సాండ్‌బర్గ్‌తో నిశ్చితార్థం జరుపుకున్న మియా 2021 సమ్మర్‌లో వివాహబంధంతో ఒక్కటవబోతుందట. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది మియా. తన సోషల్ మీడియా పేజ్‌లో రాబర్ట్‌ నేను ఓ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే వేసవిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పెళ్లికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఇది ఫన్‌ టైం అంటూ ట్వీట్ చేసింది మియా. రాబర్ట్‌ కూడా మియాతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. త్వరలో తాము ఒక్కటవ్వబోతున్నామని క్లారిటి ఇచ్చాడు.

అయితే మియాకు ఇది సెకండ్ మ్యారేజ్ కావడం ఎవరికీ తెలియని పెద్ద ట్విస్ట్. 2011 ఫిబ్రవరిలో తన హై స్కూల్‌మేట్‌ను మియా వివాహం చేసుకుంది. కానీ మనస్పర్థలు రావటంతో 2014లో విడిపోయిన వారిద్దరు 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కాలేజీ రోజుల్లో బార్‌ టెండర్‌గా పనిచేసిన మియా ఖలీఫా, పలు టీవీ, గేమ్ షోస్‌లోనూ నటించింది.
గ్రాడ్యూషన్‌ పూర్తి చేసిన తరువాత మియామీలో న్యూడ్‌ మోడలింగ్‌ ఆఫర్లు రావటంతో ఆ రంగంలోకి అడుగుపెట్టి... తరువాత అడల్ట్‌ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మియా అడల్ట్‌ మూవీస్ చేయడంలో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినా మియా పోర్న్‌ రంగంలోకి అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులందరు మియాకు దూరంగా ఉంటున్నారు. పోర్న్‌ ఇండస్ట్రీలో

మియా పనిచేసింది కొంత కాలమే అయినా ఆ రంగంలో టాప్‌ స్టార్‌గా చాలా పాపులర్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే సన్నీ లియోని తర్వాత అంతగా ఫేమస్ అయింది మియానే. 
గతంలో ఓ వీడియోలో హిజబ్‌ ధరించి నటించిన కారణంగా మియాకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌ ఆమెను చంపేస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం మియా ఖలీఫా పోర్న్‌ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ రంగాన్ని ఆమె వదిలేసి 5 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆమె వీడియోలు పోర్న్‌ సైట్స్‌లో టాప్‌లో ర్యాంక్‌ అవుతుంటాయి. ఏదేమైనా ఇలా పోర్న్ స్టార్స్ ఆ నీచమైన వృత్తిని వదిలేసి ఇతర రంగమలో సెటిలవడం మంచికేనన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: