సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణంరాజు వయస్సు 79 సంవత్సరాలు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో ఐసీయూలో రెబెల్ స్టార్ కృష్ణం రాజుకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కృష్ణం రాజు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. 

                  

అయితే రెబల్ స్టార్ కృష్ణం రాజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని వార్తలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. నిన్న బుధువారం రోజు రాత్రి సమయంలో శ్వాసకోసం సమస్య తీవ్రం అవ్వడంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది.  

                

1970, 1980ల సంవత్సరాల్లో 183 తెలుగు సినిమాలలో నటించాడు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. జనవరి 20, 1940న జన్మించాడు. సినిమాలు అంటే ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృష్ణం రాజు ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఎన్నో సూపర్ డూపర్ చిత్రాల్లో కృష్ణం రాజు నటించాడు. రాజకీయా ప్రవేశం అనంతరం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. 


అయితే ప్రస్తుతం కృష్ణం రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతలోనే కృష్ణం రాజు అనారోగ్యానికి గురయ్యారు. అయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: