స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో'. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, నివేత పేతురాజ్, సునీల్, సుశాంత్ అక్కినేని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు థమన్ స్వర పరిచిన రెండు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకుని శ్రోతలను అలరించగా, 

రేపు ఈ సినిమా నుండి మూడవ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది. #OMGDaddy అనే హ్యాష్ ట్యాగ్ తో నిన్నటి నుండి సాంగ్ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని నేడు ఈ సాంగ్ టీజర్ ని నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బన్నీ కొడుకు, కూతురైన అల్లు అయాన్, అర్హల పై సరదాగా చిత్రీకరించిన ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఓ మై గాడ్ డాడీ అంటూ పెపి స్టైల్ లో సాగిన ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, బ్లేజి, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్ కలిసి సూపర్బ్ గా పాడినట్లు తెలుస్తోంది. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని అతి త్వరలో విడుదల చేయనున్నారు. 

ఇటీవల బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, ఈ సినిమా కూడా తప్పనిసరిగా సూపర్ హిట్ కొట్టి వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ గా నవీన్ నూలి పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పర్చుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: