ప్రస్తుతం సెన్సార్ బోర్డు తీరు  దర్శకనిర్మాతలు అందరికీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రోజురోజుకు సినిమాలు తీసే విధానం మారుతుంది కానీ సెన్సార్ బోర్డ్ రూల్స్ మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. దీంతో కాస్త డిఫరెంట్గా దర్శకులు ఏదైనా ట్రై చేస్తే దానిపై సెన్సార్ బోర్డ్ డిస్క్లయిమర్ విధింస్తుంది . దర్శక నిర్మాతలందరూ సెన్సార్ బోర్డు  చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డ్ విధిస్తున్న రూల్స్ పట్ల దర్శక నిర్మాతలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాల్లో మద్యం తాగడం సిగరెట్ తాగడం లాంటి వాటిపై సెన్సార్ బోర్డ్ ఎప్పటినుంచో  డిస్క్లైమర్ వేయాలని రూల్ పెట్టినప్పటికీ ఆ రూల్స్  ఇప్పుడు ఇంకాస్త గట్టిగా అమలుచేస్తోంది సెన్సార్ బోర్డ్. 

 

 

 

 అయితే ఈ రూల్  ఒక సినిమాలకే కాదు బుల్లితెర లో ప్రసారమయ్యే అన్ని  కార్యక్రమాలకు వర్తిస్తుంది. అయితే తాజాగా ఈ రూల్ ను  మరింతగా పటిష్టం చేసింది సెన్సార్ బోర్డు. అయితే ఇప్పటి నుంచి సినిమాల్లో కానీ బుల్లితెరపై కానీ ఎక్కడైనా సిగరెట్ తాగడం కానీ మందు తాగడం కానీ కనిపిస్తే డిస్క్లైమర్ వేయడమే కాదు మందు మందు సీసాలు గ్లాసులు కనిపించకుండా బ్లర్ చేస్తుంది. అయితే సెన్సార్ బోర్డ్ విధించిన రూల్  మాత్రం ఇంకా భారతీయ సినిమాల్లోకి రాలేదు. కానీ హాలీవుడ్ సినిమాల్లో  మాత్రం ఈ రూల్  చచ్చినట్లు పాటించక తప్పడం లేదు. 

 

 

 

 ఇటీవలే ఫర్హాన్ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ  అనే మూవీ చూసారు. ఆ సినిమాలో ఎన్నిసార్లు మద్యం బాటిళ్లు సిగరెట్లు కనిపిస్తే అన్ని సార్లు  డిస్క్లైమర్ వేయడంతోపాటు సిగరెట్టు మందు బాటిల్ ను కనిపించకుండా బ్లర్  చేసింది  సెన్సార్ బోర్డు. దీనిపై స్పందించిన ఫర్హాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా లో మద్యం బాటిళ్లను బ్లర్  చేయడం చూసి తాను షాక్కి గురయ్యానని చెప్పారు ఆయన. ఎందుకంటే విదేశాల్లో మద్యం సేవించడం అనేది తప్పు కాదు అక్కడ  స్వేచ్ఛ ఉంటుంది అయితే అలాంటిది  సెన్సార్ బోర్డు  మద్యం సీసాల పై బ్లర్  విధించడంతో తాను ఖంగుతిన్నట్లు  తెలిపారు. దీంతో ఫర్హాన్ వెంటనే ఆ సినిమాలోని మందు బాటిల్ కనిపించే ఓ సీన్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ... ముందు ముందు సినిమాలు కాదు ప్రేక్షకులకు తెరపై చదివి వినిపించడం జరుగుతుంది అని  కామెంట్ చేశారు. ఎందుకు ఇండియన్ అడల్ట్ ని ఒక నేరంలా  చూపిస్తున్నారు.ఒప్పును  తప్పు అని ఎందుకు చూపిస్తున్నారో  అర్థం కావట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: