సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ.. హన్సిక కథానాయకగా నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఇందులో సందీప్ న్యాయవాది వృత్తిలో నటిస్తున్నాడు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను కంప్రమైజ్ చేస్తూ ఉన్న పాత్రలో సందీప్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ,రజీత,సప్తగిరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హాస్య ప్రధానంగా సినిమా తెరక్కుతుంది. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  


హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ తో  థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని నాగేశ్వర్ రెడ్డి బాగా డీల్ చేశారు. రెండుగంటలపాటు ఆడియెన్స్ ని నవ్వించడం ఒక గిఫ్ట్ గా భావిస్తున్నాను. నాలుగు సెంటర్స్‌లో ప్రీమియర్ షోస్ వేస్తున్నాం. ఈ సినిమాతో నాగేశ్వర్ రెడ్డి లాంటి ఒక ఫ్రెండ్ దొరకడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాలోని ప్లస్ పాయింట్స్ ని ఎలివేట్ చేస్తూ..మైనస్‌ని కవర్ చేస్తూ.. సినిమాని ఫెంటాస్టిక్ గా రూపొందించారు. హన్సిక మంచి క్యారెక్టర్ చేసింది. అలాగే ప్రమోషన్స్ కి తానే ముందుండి సపోర్ట్ చేస్తుంది. తెనాలి రామకృష్ణ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.. అన్నారు. అలాగే ఆడియ‌న్స్ న‌న్ను ఇంత‌లాగా ఆద‌రిస్తున్నందుకు ఆడియ‌న్స్‌కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది రిలీజ్‌డేట్ కంటే ఒక రోజు ముందే ఈ సినిమాను ప్రీమియ‌ర్ షోగా అన్ని థియేట‌ర్స్‌లో ఈ రోజు రాత్రికి విడుద‌ల చేస్తున్నాం. ఈ రెండుగంట‌ల ఎంట‌ర్‌టైన్మెంట్ అనేది నేను వాళ్ళ‌కు ఇచ్చే గిఫ్ట్ అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: