మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంటూ సినిమాలు నిర్మిస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ అనే సంస్థ రామ్ చరణ్ పెట్టడం జరిగింది. ఏకంగా సైరా సినిమా కోసం చిరంజీవి రెండు సంవత్సరాలు కేటాయించడంతో చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమా విషయంలో నిర్మాతగా వరుసగా చిరంజీవి మూడో సినిమాకి రామ్ చరణ్ వ్యవహరించడంతో తాజాగా చేయబోయే సినిమా కోసం షాకింగ్ డెసిషన్ రామ్ చరణ్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న rrr సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


ఇదే తరుణంలో ఆరు పదుల వయసులో కూడా కొరటాల శివ తో చేయబోయే సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గే పనిలో జిమ్ లో వర్కవుట్లు చేస్తూ స్పెషల్ డైట్ పాటిస్తూ తెగ కష్టపడి పోతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో దసరా పండుగ నాడు సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పై ఇటీవల సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్న తరుణంలో రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మీడియా సమావేశం పెట్టి మెగా అభిమానులకు క్లారిటీ ఇవ్వటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.


ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో అనేక పేర్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న క్రమంలో ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడానికి రామ్ చరణ్ రెడీ అయినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా సైరా సినిమా టైపులో రెండు సంవత్సరాలు అన్న విధంగా కాకుండా కేవలం జనవరిలో మొదలుపెట్టి వచ్చే సమ్మర్ లోపు ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్లు...దానికోసం డైరెక్టర్ కొరటాల శివ కి సరైన షెడ్యూలు ప్లాన్ చేయాలని ముందే ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: