స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మార్కెట్ సౌత్ పరంగా మంచి సక్సెస్ రేటు ఉన్న నేపథ్యంలో 'అలా వైకుంఠపురం లో' సినిమా హక్కులు భారీగానే పలుకుతున్నాయి. ఇదే తరుణంలో సరైనోడు ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు హిందీలో కూడా సాధించడంతో ఈ సినిమాకి సంబంధించిన హిందీ డిజిటల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గతంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా హిందీ డిజిటల్ కొనుగోలుదారులకు మంచి ప్రాఫిట్ తీసుకురావటం జరిగాయి. దీంతో అదే నమ్మకంతో ఈ సినిమాకి రూ.19.50 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తానికి హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు ఇచ్చేయడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం.


నిజానికి నిర్మాతలు రూ.22 కోట్లు డిమాండ్ చేయగా.. ఫైనల్ గా రూ.19.50 కోట్లకు ఫిక్స్ చేసుకున్నారు. మొత్తం మీద సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న 'అల వైకుంఠపురం లో' జనవరి 12వ తారీకు న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'నా పేరు సూర్య' సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.


అంతేకాకుండా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కొట్టాలని కూడా బన్నీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క గతంలో త్రివిక్రమ్ బన్ని కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు డిసైడ్ అయిపోతున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో 'అలా వైకుంఠపురం లో' సినిమా సంక్రాంతికి భారీ హిట్ కొట్టడం గ్యారెంటీ అని చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: