ప్రస్తుతం వార్తా మాధ్యమాలు మరియు సోషల్ మీడియా చాలా అందుబాటులోకి రావడంతో బ్రతికున్న ప్రముఖులను చంపేస్తూ లేనిపోని వార్తలను కల్పిస్తూ ఇష్టానుసారంగా వార్తలు వస్తున్న క్రమంలో సమాజంలో చాలా పేరున్న పెద్ద పెద్ద రాజకీయ నేతలు మరియు సెలబ్రిటీలు తమకంటూ సోషల్ మీడియాలో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసుకుని తమపై వస్తున్న అనవసరమైన వార్తలకు క్లారిటీ ఇస్తూ ఇటువంటి వార్తలను పుట్టించే వారిపై రాసేవారిపై తమ ఆగ్రహాన్ని చాటుతున్నారు. ఈ విధంగానే ప్రముఖ బిజెపి పార్టీ నాయకులు మరియు సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి వార్తలు చాలా దారుణంగా రావడంతో ఆయన సీరియస్ అయ్యారు.


విషయంలోకి వెళితే నటుడు కృష్ణంరాజు ఆరోగ్యం దెబ్బతిని ఇటీవల బంజారా హిల్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తీవ్ర అనారోగ్యం గా ఉన్నట్లు ఫుల్లు సీరియస్ గా ఉన్నట్లు ఐసీయూలో జాయిన్ అయినట్టు ఇటీవల కొన్ని వార్తా పత్రికల వార్తలు రావడంతో వచ్చిన వార్తలను ఉద్దేశించి కృష్ణంరాజు స్పందించారు. సదరు పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఖండించారు.


ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. "కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటురెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు'' అన్నారు. దీంతో కృష్ణంరాజు అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా వచ్చిన వార్తలపై అభిమానులు కూడా సీరియస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: