యంగ్ హీరో శర్వానంద్ గత మూడేళ్ళుగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. సక్సస్, ఫెల్యూర్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసాడు. మిగతా యంగ్ హీరోలతో చూస్తే హిట్లు.. ప్లాప్ లను సమానంగా బ్యాలెన్స్ చేయగలిగాడు కూడా. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రతి సినిమాని మొదటి సినిమాగానే భావించాలి. బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. లేదంటే ఘోర పరాజయాలను అందుకొని రేస్ లో వెనకబడటం ఖాయం. కానీ శర్వానంద్ ఆ విషయంలో వెనుకబడే ఉన్నాడు. 'పడి పడి లేచే మనసు' - 'రణరంగం' సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి శర్వా కి తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో శర్వా హిట్ పడే కథ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. 

ప్రస్తుతం శర్వా '96' రీమేక్ లో నటిస్తున్నాడు. సమంత కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై దిల్ రాజుతో పాటు శర్వా చాలా ఆశలు పెట్టుకున్నారు. నిర్మాత ఎంతో ఇష్టపడి ఎంచుకున్న కథ పైగా.. ఆయన జడ్జిమెంట్ పై నమ్మకంతో శర్వా వెంటనే ఓకే చేశాడు. ఈ నేపథ్యంలో 96 పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ఇక్కడే శర్వా తప్పు చేశాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చేసే శర్వా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేడంటే అది తన తప్పేనని మాట్లాడుకుంటున్నారు. 

ఇక ప్రస్తుతానికి 96 తప్ప కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. 'శ్రీకారం'.. 'కీరవాణి' అనే రెండు స్క్రిప్టులు ఫైనల్ చేశాడని ప్రచారం జరిగినప్పటికి వాటికి సంబంధించి ఎలాంటి క్లారిటి ఇప్పటి వరకు శర్వా ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకూ ఒప్పుకున్న కథల్ని తిరిగి బెటర్ మెంట్ చేయాలని దర్శక, రచయితలకు చెప్పాడట. వరుస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో ఈసారి కథల విషయంలో కేరింగ్ ఎక్కువైనట్లే కనిపిస్తోంది. ఒకటికి  రెండు సార్లు స్క్రిప్టుని చెక్ చేసుకోమని..అవి వర్కౌట్ అవుతాయా లేదా? అని తన సన్నిహితులను అడిగి మరీ తెలుసుకుంటున్నాడట. ఇక రిలీజ్ కి రావాల్సిన 96 కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా సరిగా జరగడం లేదు. 'సరిలేరు'.. మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి 96 ని పక్కన పెట్టి దిల్ రాజు శర్వా ని మోసం చేస్తున్నాడన్న టాక్ ఒకటి వినిపిస్తోంది. 

అయితే అసలు మోస పోతుంది సమంత అని మరో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సమంత ఈ ఏడాది మజిలీ, ఓ బేబీ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఒకవేళ '96' అనుకున్న సమయానికి రిలీజై హిట్ గనక అయితే సమంత రేంజ్ ఇంకా వేరేలా ఉండేది. కానీ దిల్ రాజు '96' ని పక్కన పెట్టడంతో తన ఖాతాలో ఒక సక్సస్ మైనస్ అవుతుందని సమంత కూడా ఫీలవుతుందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: