యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా రూలర్. బాలకృష్ణ, ధర్మ అనే మాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక ఒక ముఖ్య పాత్రలో నటిష్తోంది. 

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అఫీషియల్ ఫస్ట్ లుక్ మరియు బాలయ్య ఫ్రెంచ్ గడ్డంతో సూట్ వేసుకున్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేసాయి. ఇకపోతే నేడు బాలయ్య గోల్ఫ్ ఆడుతూ స్టైలిష్ లుక్ లో దిగిన ఫోటో కాసేపటి క్రితం సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో బాలయ్యను చూసిన నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కాగా ఈ పిక్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మంచి మాస్ ఎంటర్టైనర్ గా, అన్ని రకాల కమర్షియల్ హంగులతో దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకుని ఉండడంతో, ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్ అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఫ్లాప్స్ గా నిలవడంతో బాలయ్య కొంత ఢీలా పడ్డారు. మరి డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: