టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడం జరిగింది. ఇక టాలీవుడ్ లో ఎంతో గొప్ప దర్శకులైన కె రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, కోదండరామిరెడ్డి, కె విశ్వనాధ్ వంటి వారితో నటించిన చిరంజీవి, ఆ తరువాత టాలీవుడ్ లో మంచి సక్సెస్ లు అందుకుని మంచి పేరున్న డైరెక్టర్ గా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. అప్పట్లో క్రేజీ స్టార్లుగా ఎదిగిన వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు తీసి హిట్స్ కొట్టిన వర్మ, మెగాస్టాట్ తో ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ లో ప్రశ్నగానే మిగిలిపొయింది. 

అయితే ఇందులో ఒక ముఖ్య విషయం దాగి ఉంది అనేది మనలో చాలా మందికి తెలియదు. అదేమిటంటే, కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ మరియు వర్మ కాంబినేషన్లో ఊర్మిళ మతోండ్కర్ హీరోయిన్ గా ఒక భారీ హిందీ చిత్రం ప్రారంభం అయి, ఒక సాంగ్ మరియు కొంత భాగం సినిమా షూటింగ్ చేసిన తరువాత అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. కొంత పార్ట్ షూటింగ్ జరిగి కూడా అలా సడన్ గా ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయమై ఇప్పటికీ కూడా సరైన సమాచారం లేదు. ఇక అప్పట్లో మెగాస్టార్ ఫ్యాన్స్, కావాలనే వర్మ మా హీరోతో సినిమాను ఆపేశారని పలు విమర్శలు కూడా చేసినట్లు సమాచారం. 

అయితే ఈ విషయమై అటు మెగాస్టార్ కానీ, ఇటు వర్మ గాని సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అది నిజంగా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక ఆ సినిమా కోసం మెగాస్టార్ మరియు ఊర్మిళ పై చిత్రీకరించిన ఒక పాట ఇప్పటికీ మనకు యూట్యూబ్ లో దర్శనం ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారిద్దరూ మాత్రం కలిసి ఒక సినిమా చేసే పరిస్థితి లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీస్తుండగా, మరోవైపు మెగాస్టార్ తన 152వ సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: