గోవా బ్యూటీ ఇలియానా అందం అంతా ఆ నడుములోనే ఉందంటున్న కుర్రాళ్లూ, ఆమె హోయలకు ఫిదా అయ్యారు. ఇకపోతే  ఈ ముద్దుగుమ్మ దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై... పోకిరితో సూపర్ హిట్ అందుకునడమే కాదు. తెలుగు తెరను అప్పటి నుంచీ తన సినిమాలతో షేక్ చేసింది.. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు తన ఖాతాలో వేసుకుంది..


కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా... కొంచెం కష్టపడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారి అదరగొడుతోంది. ఇకపోతే కొంతకాలం క్రిందట ప్రేమ వ్యవహారంతో కెరీర్లో కొన్ని ఇబ్బందులు పడింది. అయితే, ఇప్పుడు ప్రేమ వ్యవహారం నుంచి బయటకు వచ్చిన ఈ హీరోయిన్ తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టింది.  ఆ సినిమాలు ఎందుకు చేస్తుందంటే ఇలియానా మనసులో ఓ బలమైన కోరిక ఉందట. 


దాని కోసమే సినిమాలు చేస్తున్నట్టు చెప్తోంది. ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోని ఆనందంగా జీవితాన్ని గడపాలని మళ్లీ  కష్టపడటానికి సిద్దమైందట. ఆమెకున్న కోరిక ఏంటంటే గోవాలో ఇల్లు కొనుక్కోవడమే ఇప్పుడు ఆమె టార్గెట్ గా పెట్టుకుందట.   ఇప్పటికే గోవాలో ఒక ఇల్లు ఉందట. కానీ అది సముద్రానికి దూరంగా ఉందని, సముద్రానికి దగ్గరగా ఉండే ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్నదట ఈ సుందరీ. 


ఇందుకు గాను దాని కోసమే మరలా సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేస్తుందట..  అందుకే తిరిగి సన్నబడి తన పరిచయాలతో సినిమా రంగంలోకి అడుగుపెట్ట బోతున్నది. ఇక ఇలియాన పంట పండితే వచ్చే ఏడాది నాటికి బీచ్ లో ఇల్లు  కొనాలి అన్న ఈ అమ్మడి టార్గెట్ తొందర్లోనే నెరవేరుతుందన్నట్లు...  


మరింత సమాచారం తెలుసుకోండి: