టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన ఈ సినిమాలో రష్మిక మందన నటిస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అటు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలా వైకుంటపురం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కాగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల్ని సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి...  టాలీవుడ్ దర్శకులు హీరోలు అందరూ ఈ పండుగను టార్గెట్ చేస్తూ సినిమాలను విడుదల చేస్తుంటారు. సంక్రాంతి పండుగ క్రమంలో ఒకరోజు తేడాతోనే చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగకు విడుదల చేయడం ఒక సెంటిమెంట్. అంతేకాకుండా సంక్రాంతి పండుగ పూట జనాలందరూ ఖాళీగా ఉండడంతో  సినిమాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 

 

 దీన్ని అదునుగా తీసుకుని నిర్మాతలు హీరోలు సంక్రాంతికీ  తమ తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొని ఉన్నట్లు కనిపిస్తుంది. మామూలుగానే సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల సినిమాలకు హడావిడి ఉండడం కామన్. కానీ ఈ  సంక్రాంతికి హడావిడి కాస్త డబల్ అయ్యేట్లు కనిపిస్తుంది. దీనికి కారణం సూపర్ స్టార్ మహేష్ హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు... అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతి నాడు విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . దీంతో టాలీవుడ్ లో టాప్ హీరోలైన ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తే  కమర్షియల్ గా బాగా నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు.

 

 

 రెండు పెద్ద  సినిమాలు  ఒకే రోజు విడుదల అయితే ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం నిర్మాతలకు నష్టం కలిగించే అంశం అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు సినిమాలను ఒక్క రోజు తేడాతో అయినా సరే విడుదల చేస్తే కొంత లాభం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అటు అల్లు అర్జున్ మహేష్ బాబు మాత్రం జనవరి 12న సంక్రాంతి రోజున సినిమాను విడుదల చేయాలని పట్టుబట్టినట్లు టాక్. ఈ రెండు సినిమాల్లో ఏది వెనక్కి తగ్గకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొనె  పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా రెండు నెల్ల  టైం ఉండడంతో అప్పటి లోపు విడుదల తేదీ లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: