ఆయన టాలీవుడ్ టాప్ నిర్మాత కానీ థియేటర్  కరెంట్ బిల్  కట్టలేని పరిస్థితి... ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా ... టాలీవుడ్ టాప్ నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు. సురేష్ బాబు దగ్గర కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బు లేకపోవడం ఏంటి అంటారా... ఇంతకీ ఆయన ఏమన్నాడో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలను నిర్మించేందుకు  నిర్మాతలు రోజురోజుకు తగ్గిపోతున్నారు. అసలు చిన్న సినిమాలకు అయితే లైఫ్ లేదంటున్నారు సురేష్ బాబు. అంతేకాకుండా తాను నిర్వహిస్తున్న థియేటర్స్ కీ కరెంట్ బిల్ కట్టే పరిస్థితి లేకపోవటం తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అంటూ  సురేష్ బాబు చెబుతున్నారు. దీనికి కారణం అమెజాన్ నెట్ ఫ్లిక్స్  లాంటి  డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలే  అని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు నిర్మాతలు అందరూ డిజిటల్ రైట్స్ రూపంలో సరికొత్త విప్లవం మొదలెట్టారు . ఒకప్పుడు సినిమాలంటే విడుదలైన తర్వాత రెండు మూడు నెలలకు కానీ ఒరిజినల్ ప్రింట్ వచ్చేది కాదు. ఆ సినిమాలన్నీ టెలివిజన్ లో  ప్లే అవ్వాలంటే ఇంకా చాల టైం పట్టేది . ఇక ఇప్పుడు మాత్రం డిజిటల్ రైట్స్ పుణ్యమా అని సినిమా విడుదలైన కేవలం నెలరోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తున్నాయి. 

 

 

 

 ప్రేక్షకులందరూ ఎంతో కష్టపడి థియేటర్కు వెళ్లి సినిమా చూడడం కంటే కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది కదా ఆన్లైన్లో సినిమా వచ్చేస్తుంది అంటూ తీరిక ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయితే డిజిటల్ రైట్ వల్ల నిర్మాతలకు లాభం కూడా  చేకూరుతుంది. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ శాటిలైట్ ఆడియో రైట్ లతో పాటు... ప్రస్తుతం సినిమాలకి డిజిటల్ రైట్స్ కూడా కొన్ని కోట్లు తెచ్చిపెడుతున్నాయి . ఆమెజాన్ నెట్ ఫ్లిక్స్  జియో  లాంటి సంస్థలైతే కొత్త కొత్త సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనడం తో అటు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదండోయ్ విడుదలైన కొన్ని  రోజుల్లోపే సినిమాలు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తుండడంతో ఇటు  ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ రైట్స్ కోట్లు కురిపిస్తు లాభాలను తెచ్చిపెడుతున్నప్పటికీ...  భవిష్యత్తులో మాత్రం దీని వల్ల ఇండస్ట్రీకి నష్టం తప్పదని అంటున్నారు నిర్మాత సురేష్ బాబు లాంటి వాళ్ళు సంచలనవ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరోసారి ఇదే గుర్తు చేశారు నిర్మాత సురేష్ బాబు. డిజిటల్ రైట్స్ పై సమావేశమైన తెలుగు నిర్మాతల మండలి డిజిటల్ రైట్స్ పై సంచలన  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 

 ఇక ఇప్పటినుంచి సినిమా విడుదలైన నాలుగు వారాల్లో సినిమాను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయటం కుదరదని  కచ్చితంగా 8 వారాలు పూర్తి అయిన తర్వాత సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తో కొందరు నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సాహో సైరా లాంటి పెద్ద పెద్ద సినిమాలు  చూడడానికి మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు తప్ప చిన్న సినిమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు అంటూ సురేష్ బాబు చెబుతున్నారు. ఒకవేళ ఇదే కొనసాగితే భవిష్యత్తులో సినిమా థియేటర్లను కల్యాణమండపాలు గా మారిపోతాయని  ఆయన తెలిపారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడు వేల థియేటర్లు  ఉండేదని కానీ ఇప్పుడు కేవలం 1700 మాత్రమే ఉన్నాయని సురేష్ బాబు  తెలిపారు. పరిస్థితి మరీ దారుణంగా మారకముందే చర్యలు  తీసుకోవాలని  సురేష్ బాబు  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: