సినిమా తీయడం ఒక ఎత్తు ప్రమోషన్ మరో ఎత్తు, ఇక రిలీజ్ చేయడం ఇంకా పెద్ద ఎత్తు. జనాలు రిసీవ్ చేసుకుని
సక్సెస్ ఇవ్వడం మరో ఎత్తు. ఇలా ఫిల్మ్ మేకర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సమస్యల్లో నుంచి కొన్ని తొందరగా తీరవు, మరి కొన్ని మైండ్ బ్లాంక్ చేస్తూంటాయి. దాంతో నిద్ర లేని రాత్రులు ఎన్నో...
అయితే ఇపుడు
సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ రిలీఫ్ ఒకటి లభించిందట. తాజాగా
సురేష్ బాబు తన
మూవీ వెంకీ మామను డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పడంతో సరిలేరు నీకెవ్వరు మూవీకి డేట్ ని బాగా అడ్జస్ట్మెంట్ చేసుకునే వీలు కలిగింది అంటున్నారు. ఎందుకంటే బన్నీ తన
సినిమా అల వైకుంఠపురంలో
మూవీ విషయంలో
జనవరి 12 డేట్ నుంచి కదలడంలేదు. అదే డేట్లో సరిలేరు నీకెవ్వరు మూవీని కూడా రిలీజ్ చేయాలంటే రెండు సినిమాలకు దెబ్బే.
ఇక
జనవరి 11న రిలీజ్ చేసుకోవడానికి
వెంకీ మామ పోటీకి వస్తారని అనుకుంటే అది కాస్తా
డిసెంబర్ కి వెళ్ళిపోయినిది. దాంతో
మహేష్ సరిలేరు నీకెవ్వరు
మూవీ 11న రిలీజ్ చేస్తారట. ఎటూ 10న
రజనీకాంత్ దర్బార్ మూవీ ఉంది. ఇక
జనవరి 15న
కళ్యాణ్ రాం ఎంత మంచి వాడివిగా
మూవీ ఉంది. సో నాలుగు సినిమాలకు వరసగా ఇబ్బంది లేకుండా రిలీజ్ కి తగిన స్పేస్ దొరికింది ఇపుడు.
నిజానికి సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్లో ఉన్నవే. పోటీ కనుక గట్టిగా సాగితే కలెక్షన్లు డివైడ్ అయిపోతాయి. దాంతో సినిమాలకు టాక్ బాగున్నా బిగ్ లాస్ అవుతాయి. దీంతో సినీ పెద్దలు కూడా ఆలోచించి తమ సినిమాలాకు తామే అడ్డు కాకుండా తప్పుకోవడం మంచి పరిణామమేనని అంటున్నారు.