తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో కొట్టుకుంటోంది. మూడు రోజుల్లో 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓపెనింగ్ డే రికార్డులు బ్రేక్ అయిపోయాయని చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఉద్యోగుల జీతాల సంగతి తర్వాత... ముందు థియేటర్స్ కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చెప్పిన మాటలివి. 


సురేష్ బాబు వెంకటేశ్ తో వెంకీమామ నిర్మిస్తున్నాడు. సినిమాను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నా.. వెంకటేశ్ కు గాయం కావడంతో.. సినిమా వాయిదా పడిందన్నారు. నవంబర్. డిసెంబర్ నెల అన్ సీజన్ ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో.. డిసెంబర్ లో ముందుకు తీసుకొస్తున్నామన్నారు సురేష్ బాబు. 


తెలుగు సినిమా వీకెండ్.. హాలిడే బిజినెస్ మారిందనీ.. శని, ఆదివారాలు.. హాలిడేస్ లో తప్ప ప్రేక్షకులు థియేటర్స్ దగ్గరకు రావడం లేదంటున్నారు సురేష్ బాబు. సినిమా రిలీజైన నెల రోజులకే  డిజిటర్ ఫ్లాట్ ఫామ్ అమోజాన్.. నెట్ ఫ్లిక్స్ లో సినిమా పెట్టేయడంతో.. కొన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమా చూడటం మానేశారు. సాహో.. సైలా లాంటి గ్రాండీయర్ మూవీస్ తప్ప రెగ్యులర్ మూవీస్ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు సురేష్ బాబు. దీంతో వీక్ డేస్ లో వసూళ్లు భారీగా తగ్గిపోయాయనీ.. కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని వాపోయారు నిర్మాత. 


మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కు ఆదరణ తగ్గిపోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు నిర్మాత సురేష్ బాబు. పెద్ద పెద్ద సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చినంత.. చిన్న చిన్న సినిమాలకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందని వాపోయారు. ఏదో పండుగలకు, వీకెండ్స్ లో తప్పా.. మిగతా రోజుల్లో థియేటర్స్ వైపు చూసేందుకు కూడా ఆసక్తి కనుబరచకుండా పోవడంతో థియేటర్స్ యాజమాన్యం పరిస్థితి దీనంగా తయారైనట్టు చెప్పారు. దీంతో వారు కనీసం మెయింటైన్ ఛార్జీలు కూడా కేటాయించలేని దుర్భర జీవితాన్ని అనుభిస్తున్నారని అన్నారు నిర్మాత సురేష్ బాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: