తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల కి సిద్ధంగా వున్నది. అయితే టైటిల్ కార్డు నుండి సంచలన విషయాలను వెల్లడిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. పాటల విషయంలో, సన్నివేశాల చిత్రీకరణ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది.


అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకునే తీరుని సైతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో రామ్ గోపాల్ వర్మ చూపించనున్నారట. ముఖ్యమంత్రిగా కొత్త నాయకుడు జగన్ పాత్రధారి ముఖ్యమంత్రి అయ్యే దగ్గరి నుండి సినిమా మొదలవుతుందని అన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు తెరకెక్కిస్తూ. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇది రెండు కులాలకు మధ్య జరిగిన పోరులాగ ఉండటం తో ఈ చిత్ర టైటిల్ పై పోలీస్ కేసు నమోదయిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో సంచలనాలు చూడటానికి ప్రజలు సైతం ఈ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
 
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లాగా ఈ చిత్రం కూడా మంచి హిట్ అవుద్దా లేక ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది చూడాలి. 
రాజకీయ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంధించిన మరో కమర్షియల్ అస్త్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఎన్నో అంచనాల మధ్య రిలీజైతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి. కేఏపాల్‌కి సంబంధించిన స్పెష‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేసిన వర్మ..  మ‌రో పాట‌లో ఫ‌స్ట్ పార్ట్‌లో తండ్రి ప‌డే బాధ‌, సెకండ్ పార్ట్‌లో కొడుకు ప‌డుతున్న బాధ‌ల‌ని చూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: