చాలా ఘోరమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురైన ఒక మహిళ కి దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యాయం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి నెల్లూరు న్యాయస్థానం సదరు నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఇదంతా దొరవారిసత్రం మండలం కట్టుపల్లి గ్రామంలో జరుగగా ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి పెళ్లయి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సమీపంలోని అపాచీ కంపెనీ లో అతను పనిచేస్తుండగా అతని భార్య ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండేది. చివరికి అదే ఆమె పాలిట యమశాపంగా మారి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.

 

ఇదంతా తెలిసి ఆమె పై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మీజూరు చెన్నయ్య అనే వ్యక్తి 2015 ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి దూరి తన కోరికలు తీర్చకపోతే ఆమె పిల్లలు చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయమంతా కంపెనీలో కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు జరిగిన విషయం చెప్పి బాధపడడంతో వెంటనే అతను తన భార్యతో కలిసి దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కూడా స్పందించి చెంగయ్య పై అత్యాచారం కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.

 

దాదాపు నాలుగేళ్ల పాటు ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు విన్న జిల్లా కోర్టు ఎట్టకేలకు నిందితుడికి జైలు శిక్ష విధించింది. ఈ కేసులో చెంగయ్యపై మోపిన అభియోగాలు ఆధారాలతో సహా పోలీసులు నిరూపించడంతో నెల్లూరు 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో చెంగయ్యకు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.35వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.సత్యనారాయణ సోమవారం తీర్పు వెలువరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: