టాలీవుడ్ సీనియర్ హీరోలలో సినిమాలు స్పీడ్ గా కుర్ర హీరోల కంటే ఎక్కువగా చేస్తున్నది విక్టరీ వెంకటేష్. కాలం మారుతున్న తరుణంలో సినిమా ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్త ధనం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మారుతున్న తరానికి వారి ఆలోచనలకు తగిన విధంగా సినిమా స్టోరీ లు ఎంచుకుంటూ అదరగొట్టే రీతులతో వరుసపెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను మరియు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెంకటేష్. ప్రస్తుతం 'వెంకీ మామ' అనే సినిమాలో సొంత మేనల్లుడు అయిన నాగ చైతన్య తో వెంకటేష్ ఈ సినిమాలో మావ గా నటించడం తో త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో తాజాగా వెంకటేష్ తర్వాత చేయబోయే సినిమా విషయం గురించి ఒక కొత్త వార్త ఇటీవల బయటకు వచ్చింది.

 

అదేమిటంటే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా  `అసుర‌న్`… తెలుగులో రీమేక్ చేయటానికి వెంకటేష్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే సినిమా నిర్మాత డి.సురేష్ బాబు క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా అనుష్కను తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనుష్కకు ముందు శ్రేయ ని తీసుకోవాలని భావించిన సినిమా యూనిట్ హీరోయిన్ పాత్రలో అనుష్క అయితేనే సెట్ అవుతుంది అని చివరాకరికి డిసైడ్ అయి ప్రస్తుతం అనుష్క తో చిత్ర బృందం మంతనాలు జరుపుతున్నట్లు అంతా ఓకే అయితే త్వరలోనే అనుష్క ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

 

గతంలో వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమా మరియు అదే విధంగా నాగవల్లి సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేసింది. ఇటువంటి తరుణంలో మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తున్నాడు అన్న వార్త బయటకు రావడం 'చింతకాయల రవి' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ చాలా మంది సినిమా ప్రేమికులు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వార్త పై కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: